హ్యాకర్ల ద్వారా లీక్ అయిన డేటాలో మీ జిమెయిల్, ఫేస్ బుక్, ఇన్స్ స్టాగ్రామ్, ట్వీటర్ వంటి మీ అక్కౌంట్ డాటా ఉంటే కొన్ని సెకండ్లలోనే వాటి గురించి పూర్తిగా తెలుసుకోవచ్చు.
గత కొద్ది రోజులుగా పలు రకాల డేటా లీక్ పై వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ డేటా లీక్ అయినట్టు కూడా వార్తలు వెలువడ్డాయి. అంతేకాదు ఆన్ లైన్ షాపింగ్ సైట్స్ డాటా కూడా డార్క్ వెబ్ లో ప్రత్యేక్షమవుతున్నాయి.
మీ ఇ-మెయిల్ ఐడి, పాస్‌వర్డ్, మొబైల్ నంబర్ మొదలైనవి హ్యాక్ అయిన తరువాత ఆ డాటా హ్యాకర్ల చేతికి చేరుతుంది, ఆ తరువాత డేటాని డార్క్ వెబ్ వంటి హ్యాకర్ల ఫోరమ్‌లలో అమ్మకానికి పెడుతారు.
undefined
ఇప్పుడు మీ ఇమెయిల్ ఐడి, పాస్ వర్డ్ హ్యాక్ అయ్యిందా లేదా అనేది అసలు ప్రశ్న. ఒకవేళ హ్యాక్ అయితే దీని గురించి మీకు సమాచారం ఎలా తెలుస్తుంది ?... ఇలాంటి వాటి గురించి సమాచారాన్ని కొన్ని సెకన్లలో పొందవచ్చు.
డేటా లీక్ ప్రమాదమా?
డేటా లీక్‌ల వల్ల కలిగే నష్టాలు ఏమిటో మొదట అర్థం చేసుకోవాలి. మీ డేటాను ఏ విధంగా హ్యాకర్లు ఉపయోగించవచ్చు ? మొదటి విషయం ఏమిటంటే మీ డేటా సాధారణంగా టెలిమార్కెటింగ్ కోసం ఉపయోగించబడుతుంది. ఇది కాకుండా లీకైన డేటా ఆధారంగా మీ పేరుతో బ్యాంకులో ఖాతా తెరవవచ్చు.
ఆ తరువాత లొన్లు పొందవచ్చు. లీక్ అయిన డేటా సహాయంతో జిమెయిల్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి మీ ఖాతాలను హ్యాక్ చేయవచ్చు. మీ పేరు, ఇ-మెయిల్‌ను పిషింగ్ దాడిలో కూడా ఉపయోగించవచ్చు.
మీ మొబైల్ నంబర్ లేదా ఇ-మెయిల్ లీక్ అయ్యిందా, లేదా
మొదట మీరు మీ ఫోన్ లేదా ల్యాప్‌టాప్ వెబ్ బ్రౌజర్‌కు వెళ్లి తరువాత haveibeenpwned.com అని టైప్ చేయాలి . దీని తరువాత మీరు క్యాప్చాను ఎంటర్ చేయాలి. ఆ తరువాత కొత్త ట్యాబ్ ఓపెన్ అవుతుంది, ఇక్కడ మీరు మీ ఇమెయిల్ ఐడిని ఎంటర్ చేసి, మీ ఇమెయిల్ ఐడి హ్యాక్ అయ్యిందో లేదో చెక్ చేయవచ్చు.
ఐడి లేదా మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసిన తర్వాత మీకు గుడ్ న్యూస్ NO pwnage ఆనే మెసేజ్ వస్తే మీ ఐడి లేదా మొబైల్ నంబర్ హ్యాక్ కాలేదు అని అర్ధం, కానీ ఓహ్ నో - pwned! అని చూపిస్తే అప్పుడు మీ ఐడి హ్యాక్ గురైనట్లు.
అంతేకాకుండా మీ ఇమెయిల్ పాస్‌వర్డ్‌ను ముందుజాగ్రత్తగా మార్చడం మంచిది. అలాగే మీ పాస్‌వర్డ్‌లో ఏదైనా నంబర్, ప్రత్యేక అక్షరాన్ని ఉపయోగించండి. జిమెయిల్ లోని ఏదైనా పాస్‌వర్డ్ సంబంధిత సెట్టింగ్‌ల కోసం మీరు myaccount.google.comకు వెళ్లవచ్చు.