ఆపిల్ ఐఫోన్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. మీ ఫోన్లో కూడా ఈ సమస్య ఉంటే ఫ్రీ సర్వీస్..

By S Ashok KumarFirst Published Apr 30, 2021, 4:29 PM IST
Highlights

ఆపిల్ ఐఫోన్ 11 సిరీస్ మోడల్స్ లో బ్యాటరీ సమస్య కారణంగా వినియోగదారులకు బ్యాటరీని ఉచితంగా మారుస్తున్నట్లు ప్రకటించింది. ఈ సమస్యని పరిష్కరించడానికి ఆపిల్ సెక్యూరిటీ ప్యాచ్‌ను కూడా విడుదల చేసింది.

ఆపిల్ ఐఫోన్ వాడుతున్నారా.. బ్యాటరీ బ్యాక్ అప్ సమస్య ఉందా.. అయితే మీకో గుడ్ న్యూస్.  అమెరికా దిగ్గజ కంపెనీ ఆపిల్  ఐఫోన్ వినియోగదారులకు బ్యాటరీని ఉచితంగా మారుస్తున్నట్లు ప్రకటించింది. అయితే బ్యాటరీని మార్చడానికి ముందు బ్యాటరీతో నిజంగా సమస్య ఉందా లేదా అని ఆపిల్ తనిఖీ చేస్తుంది.

చాలా మంది ఐఫోన్ 11 వినియోగదారులు తమ ఫోన్లలో బ్యాటరీ  బ్యాకప్ సమస్య ఉందని సమాచారం ఇస్తున్నాట్లు ఫిర్యాదు వెల్లడైంది. ఈ ఫిర్యాదు తర్వాత  బ్యాటరీని మార్చాలని ఆపిల్ నిర్ణయించింది. ఐఫోన్ 11 కొన్ని మోడల్స్ లో బగ్ కారణంగా  బ్యాటరీ ప్రభావితం అవుతుందని ఆపిల్ తెలిపింది.

ఈ కారణంగా వారు బ్యాటరీ వేగంగా  డ్రై అవుతున్న సమస్యను ఎదురుకొంటున్నారు. ఈ బగ్ కారణంగా బ్యాటరీ పనితీరు కూడా క్షీణిస్తోంది.  ఒక నివేదిక ప్రకారం ఐఫోన్ 11 సిరీస్‌లోని అన్ని మోడళ్లలో ఈ సమస్య ఉంది, అంటే  బ్యాటరీ డ్రైన్ సమస్య ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ 11 ప్రో మాక్స్‌లో  ఏర్పడింది.

also read మీ ఇమెయిల్ ఐ‌డి లేదా ఫోన్ నంబర్ హ్యాక్ అయ్యిందా.. తెలుసుకోవడానికి ఇలా చెక్ చేయండి.. ...

ఇటీవల విడుదల చేసిన ఆపిల్ ఐఓఎస్ 14.5 తో  పాటు ఈ బగ్‌ను పరిష్కరించడానికి ఆపిల్ సెక్యూరిటీ ప్యాచ్‌ను కూడా విడుదల చేసింది. ఈ అప్ డేట్  నోటిఫికేషన్ అందరికీ అందుబాటులో ఉంది, ఒకవేళ మీరు దాన్ని స్వీకరించకపోతే మీ ఫోన్ సెట్టింగులకు వెళ్లడం ద్వారా ఈ దశలను అనుసరించి అప్ డేట్ కోసం తనిఖీ చేయవచ్చు. సెట్టింగులు> జెనరల్ > సాఫ్ట్‌వేర్ అప్ డేట్ > డౌన్‌లోడ్, ఇన్‌స్టాల్ చేయండి.

సాఫ్ట్‌వేర్ అప్ డేట్ చేసిన తర్వాత ఫోన్ బ్యాటరీ హెల్త్ గురించి సమాచారం ఇవ్వడం ప్రారంభిస్తుంది. కొత్త అప్‌డేట్ తర్వాత కూడా  ఈ సమస్య తొలగిపోకపోతే అప్పుడు మీ ఫోన్ కొత్త బ్యాటరీతో  భర్తీ చేయబడుతుంది. ఇందుకోసం ఎటువంటి ఛార్జీలు వసూలు చేయబడదని ఆపిల్ తెలిపింది.

click me!