జేబిఎల్ రిఫ్లెక్ట్ ఎటర్నల్ వైర్‌లెస్ హెడ్‌ఫోన్ ప్రత్యేకత ఏంటంటే బ్లూ టూత్ హెడ్‌ఫోన్స్ కు ఛార్జింగ్ అవసరం లేకుండా ఇప్పుడు కొత్త హెడ్ ఫోన్స్ ని ప్రవేశపెడుతుంది. ఈ కొత్త వైర్‌లెస్ హెడ్ ఫోన్స్ ఇంట్లో ఉన్నప్పుడు లేదా బయట ఉన్నప్పుడు సూర్య కాంతి ఇది ద్వారా ఛార్జ్ చేయవచ్చు.
జేబిఎల్ బ్రాండ్ దేశంలో టాప్ బ్రాండ్ హెడ్ ఫోన్స్ లో ఒకటిగా మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు జేబిఎల్ బ్రాండ్ ఒక కొత్త బ్లూ టూత్ హెడ్ ఫోన్స్ ను లాంచ్ చేయనుంది. జేబిఎల్ రిఫ్లెక్ట్ ఎటర్నల్ వైర్‌లెస్ హెడ్‌ఫోన్ ప్రత్యేకత ఏంటంటే బ్లూ టూత్ హెడ్‌ఫోన్స్ కు ఛార్జింగ్ అవసరం లేకుండా ఇప్పుడు కొత్త హెడ్ ఫోన్స్ ని ప్రవేశపెడుతుంది. ఈ కొత్త వైర్‌లెస్ హెడ్ ఫోన్స్ ఇంట్లో ఉన్నప్పుడు లేదా బయట ఉన్నప్పుడు సూర్య కాంతి ఇది ద్వారా ఛార్జ్ చేయవచ్చు.
బ్లూటూత్ హెడ్‌ఫోన్‌ల బ్యాటరీ చార్జింగ్ సమస్య కోసం జెబిఎల్ ఈ కొత్త పరిష్కారాన్ని తిసుకొచ్చింది. సోలార్ పవర్ (సౌర శక్తి) ద్వారా వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్ ఛార్జింగ్ అవుతుంది. జేబిఎల్ రిఫ్లెక్ట్ ఎటర్నల్ అనేది ఒక కొత్త హెడ్‌ఫోన్ ప్రాడక్ట్. ఇది మీరు ఎండలో బయటకు వెళ్లినప్పుడు ఎక్సెగర్ పవర్‌ఫాయిల్ సోలార్ ఛార్జింగ్ టెక్నాలజీ ద్వారా సన్ లైట్ దీనిపై పడ్డప్పుడు చార్జ్ అవుతుంది. దీని వల్ల మీకు ఎక్కువ మ్యూజిక్ ప్లేటైమ్ అందించడానికిని సహాయపడుతుంది.
also read షియోమీతో ‘టగ్ ఆఫ్ వార్’: ఆర్థిక సేవల్లోకి రియల్‌మీ
జెబిఎల్ రిఫ్లెక్ట్ ఎటర్నల్ హెడ్‌ఫోన్‌లు ఆన్‌లైన్ స్టోర్స్ లేదా రిటైల్ అవుట్‌లెట్లలో ప్రస్తుతం అందుబాటులో లేవు. దీనిని వచ్చే ఏడాది అక్టోబర్‌లో మార్కెట్లోకి విడుదల చేయాలని చూస్తుంది.జెబిఎల్ రిఫ్లెక్ట్ ఎటర్నల్ హెడ్ ఫోన్స్ రెగ్యులర్ బ్లూటూత్ హెడ్ ఫోన్స్ లాగానే ఉంటాయి. అయితే వాటికి నెక్‌బ్యాండ్‌లో సోలార్ సెల్ స్ట్రిప్ ఉంటుంది.
సన్ లైట్ దానిపై పడినప్పుడు బ్యాటరీ ఛార్జింగ్ అవుతుంది. ఇందుకోసం ఎక్సెజర్ పవర్‌ఫాయిల్ సోలార్ ఛార్జింగ్ మెటీరియల్‌ను జెబిఎల్ ఉపయోగించింది. 1.5 గంటల సన్ లైట్ చార్జింగ్ వల్ల 68 గంటల వరకు మ్యూజిక్ ప్లే టైమ్ బ్యాటరీ లైఫ్ వస్తుందని జెబిఎల్ తెలిపింది.
also read కాల్స్‌పై ఆరు పైసల చార్జీ...జనవరి నుంచి రద్దు...
బ్యాటరీ మాన్యువల్ ఛార్జింగ్ చేసుకోవడానికి యుఎస్బి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. ఇది 2 గంటల్లో జెబిఎల్ రిఫ్లెక్ట్ ఎటర్నల్ హెడ్ ఫోన్స్ ఆన్బోర్డ్ 700 ఎమ్ఏహెచ్ బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేస్తుంది.IPX4 రేటెడ్ హెడ్‌ఫోన్ 40mm డ్రైవర్ల ద్వారా బ్లూటూత్ 5.0 డివైజ్ లకు దీనిని కనెక్ట్ చేసుకోవచ్చు.
జెబిఎల్ రిఫ్లెక్ట్ ఎటర్నల్ హెడ్‌ఫోన్‌లో హ్యాండ్స్-ఫ్రీ కాలింగ్, యాంబియంట్ సౌండ్ అవేర్‌నెస్, వన్-ట్యాప్ గూగుల్ అసిస్టెంట్ ఇంకా అలెక్సా సపోర్ట్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. జెబిఎల్ హెడ్‌ఫోన్ ధర $ 99 (సుమారు రూ. 7,000). రెడ్, గ్రీన్ కలర్లలో వీటిని లాంచ్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ హెడ్‌ఫోన్‌లు ఇప్పుడు క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్‌లో ఉన్నాయి.