IT Ministry plan: కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌యోగం.. ఇక‌పై అన్నింటికీ ఒకటే డిజిటిల్ కార్డు..!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 31, 2022, 04:36 PM ISTUpdated : Jan 31, 2022, 04:59 PM IST
IT Ministry plan: కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌యోగం.. ఇక‌పై అన్నింటికీ ఒకటే డిజిటిల్ కార్డు..!

సారాంశం

ఐడెంటి ఫైకి ఆధార్ కార్డు.. ఓటు వేసేందుకు ఓటర్ కార్డు.. ఆదాయ నిర్వహణలకు పాన్ కార్డ్ విదేశాలకు వీసా కార్డ్ ఇలా నాలుగైదు కార్డులు ఎప్పుడూ జేబులో పెట్టుకొని వెళ్లడం ఎవరికైనా ఇబ్బందియే.  ఈ కష్టాలను గమనించిన కేంద్రప్రభుత్వం ఇక అన్నింటికి ‘ఆధార్ కార్డు’ను పోలిన మరో డిజిటల్ కార్డు తీసుకువచ్చేందుకు కసరత్తు ప్రారంభిస్తోంది.  

ఐడెంటి ఫైకి ఆధార్ కార్డు.. ఓటు వేసేందుకు ఓటర్ కార్డు.. ఆదాయ నిర్వహణలకు పాన్ కార్డ్ విదేశాలకు వీసా కార్డ్ ఇలా నాలుగైదు కార్డులు ఎప్పుడూ జేబులో పెట్టుకొని వెళ్లడం ఎవరికైనా ఇబ్బందియే.  ఈ కష్టాలను గమనించిన కేంద్రప్రభుత్వం ఇక అన్నింటికి ‘ఆధార్ కార్డు’ను పోలిన మరో డిజిటల్ కార్డు తీసుకువచ్చేందుకు కసరత్తు ప్రారంభిస్తోంది.

ఎలక్ట్రానిక్స్ -ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రతిపాదిత ప్రణాళిక ప్రకారం.. డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్ నంబర్లు పాన్ వంటి బహుళ డిజిటల్ ఐడీలను లింక్ చేయడానికి ప్రభుత్వం ‘ఫెడరేటెడ్ డిజిటల్ ఐడెంటిటీస్’ కొత్త మోడల్ రూపొందించేందుకు పనిచేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం దేశ పౌరులు ప్రభుత్వ సేవల కోసం ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, పాన్ కార్డు, పాస్ పోర్టు వంటి ప్రభుత్వ ఐడీలను వాడుతున్న సంగతి తెలిసిందే. వీటి స్థానంలో ఒకే డిజిటల్ ఐడీ ఉంటే బెటర్ అని ప్రభుత్వం భావిస్తోంది.

ప్రతిపాదిత ఫ్రేమ్ వర్క్ కొత్త డిజిటల్ ఆర్కిటెక్చర్ ను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు నివేదిక తెలుపుతోంది. వేగవంతమైన పనితీరు ఖచ్చితమైన ఫలితాల కోసం ఫెడరల్ డిజిటల్ ఐడెంటిటీ ఉపయోగపడేలా రూపొందిస్తున్నట్టు సమాచారం. భవిష్యత్తులో వ్యక్తిగత కేవైసీ ప్రక్రియ అన్ని విభాగాల్లో సులభం అవుతుందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ఈ కొత్త డిజిటల్ ఐడీ అకారణంగా ఆధార్ కార్డ్ నంబర్ మాదిరిగానే ఒక ప్రత్యేక ఐడీ రూపొందించాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోందని సమాచారం. ఫెడరల్ డిజిటల్ ఐడెంటిటీ అనేది సెంట్రల్ అండ్ స్టేట్ సంబంధిత ఐడీ డేటాను నిల్వ చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది.

ఈ డిజిటల్ ఐడీ కేవైసీ లేదా ఈ-కేవైసీ ప్రక్రియల కోసం ఉపయోగించవచ్చు. సమ్మిళత వృద్ధిని ప్రోత్సహించడం కోసం దేశంలో ఈ-గవర్నెన్స్ అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. ఇది ఎలక్ట్రానిక్ సర్వీసులను ప్రొడక్టులను డివైజ్ లను ఉద్యోగ అవకాశాలను కవర్ చేస్తుంది. దీంతో పాటు దేశంలో ఎలక్ట్రానిక్ తయారీని కూడా బలోపేతం చేయాలని ప్రభుత్వం అనుకుంటోంది. ప్రభుత్వం తాజా ప్రతిపాదనపై విమర్శకులు డిజిటల్ భద్రతతో సమస్యలను లేవనెత్తే అవకాశం ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు. డేటా అంతా ఒకే దగ్గర ఉంటే చోరీకి గురైతే ఎక్కువ ప్రమాదం ఉంటుందనే సందేహాలున్నాయి. ఈ ప్రాతిపాదనపై పూర్తి అధ్యయనం.. రక్షణ చర్యలు తసీుకున్న తర్వాతే అమలులోకి వస్తుందని చెబుతున్నారు.  

PREV
click me!

Recommended Stories

iPhone : ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 17 ప్రో, 15 ప్లస్‌పై భారీ తగ్గింపులు !
WhatsApp Tips : మీ నెంబర్ ను ఎవరైనా బ్లాక్ చేశారా..? Meta AI సాయంతో ఈజీగా తెలుసుకోండిలా