90 గంటల స్టాండ్‌బైతో ఆరో బి‌ఎక్స్90 ప్రో వైర్‌లెస్ నెక్‌బ్యాండ్‌ విడుదల.. ధర ఎంతంటే ?

By S Ashok KumarFirst Published Jan 30, 2021, 1:31 PM IST
Highlights

ఆరో  కొత్త బిఎక్స్ 90 ప్రో వైర్‌లెస్ నెక్‌బ్యాండ్ ఇయర్‌ఫోన్‌లను భారతదేశంలో విడుదల చేసింది. ఈ నెక్‌బ్యాండ్‌ స్లిమ్ డిజైన్ తో వస్తుంది. మీరు దీనిని మెడలో ధరించడానికి సౌకర్యంగా ఉంటుంది. 

ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ ఆరో  కొత్త బిఎక్స్ 90 ప్రో వైర్‌లెస్ నెక్‌బ్యాండ్ ఇయర్‌ఫోన్‌లను భారతదేశంలో విడుదల చేసింది. ఈ నెక్‌బ్యాండ్‌ స్లిమ్ డిజైన్ తో వస్తుంది. మీరు దీనిని మెడలో ధరించడానికి సౌకర్యంగా ఉంటుంది. అంతే కాకుండా, వినియోగదారుల కోసం ఈ నెక్‌బ్యాండ్ ఇయర్‌ఫోన్‌లలో గూగుల్ అసిస్టెంట్, ఆపిల్ సిరి సపోర్ట్ కూడా అందించారు.

బిఎక్స్ 90 ప్రో వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లో గొప్ప సౌండ్ కోసం శక్తివంతమైన బేస్ కలిగి ఉంది. ఇది 90mAh స్ట్రాంగ్ బ్యాటరీతో వస్తుంది. ఒకే ఫుల్ ఛార్జీపై 6 గంటల బ్యాకప్ ఇస్తుంది. దీని బ్యాటరీ ఫుల్ ఛార్జ్‌కు 1.5 గంటల సమయం పడుతుంది. ఈ  నెక్‌బ్యాండ్ ఇయర్‌ఫోన్‌తో పాటు మృదువైన అదనపుడు ఇయర్‌బడ్స్‌ను కూడా పొందుతారు.

also read గాలి ద్వారా ఫోన్ ను చార్జ్ చేసే షియోమి వైర్ లెస్ రిమోట్ చార్జర్ వచ్చేసింది.. ఎలా పనిచేస్తుందంటే ? ...

బిఎక్స్ 90 ప్రో వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌ల కనెక్టివిటీ కోసం బ్లూటూత్ వెర్షన్ 5.0 ను కలిగి ఉండాలి. ఇది 10 మీటర్ల పరిధి వరకు వస్తుంది. ఇవి కాకుండా ఈ  ఇయర్ ఫోన్‌లో నాయిస్ క్యాన్సల్ ఫీచర్‌తో మల్టీ-ఫంక్షన్ బటన్లను అందించారు. వీటి ద్వారా, వినియోగదారులు కాల్స్ తీసుకోవడానికి, కట్ చేయడానికి, ఇంకా వాల్యూమ్‌ను కంట్రోల్ చేయవచ్చు. 

ఆరో  బిఎక్స్ 90 ప్రో వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌ల ధర 1,299 రూపాయలు. ఈ ఇయర్ ఫోన్ వినియోగదారులకు గ్రీన్, తెలుపు, నలుపు, ఎరుపు రంగు ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ నెక్‌బ్యాండ్ ఇయర్‌ఫోన్‌లను రిటైల్ స్టోర్స్ నుండి కూడా కొనుగోలు చేయవచ్చు.

గత నెల ప్రారంభంలో ఆరో   కొత్త వైర్డ్ ఇయర్ ఫోన్ "ఎం‌ఎక్స్" ను భారతదేశంలో విడుదల చేసింది. కొత్తగా లాంచ్ చేసిన ఎం‌ఎక్స్ వైర్డ్ ఇయర్ ఫోన్ లో సరౌండ్ సౌండ్‌ను ఆస్వాదించవచ్చు.  

ఎం‌ఎక్స్ సిరీస్ వైర్డ్ ఇయర్ ఫోన్స్ లో 10 వేర్వేరు మోడల్స్ ఉన్నాయి, ఇంకా ఇవి వేర్వేరు రంగులలో అందుబాటులో ఉన్నాయి. అన్ని ఇయర్ ఫోన్‌లలో ఇంటర్నల్ మైక్రోఫోన్‌ ఉంటుంది. ఆరో ఎం‌ఎక్స్ వైర్డ్ ఇయర్ ఫోన్‌ల ప్రారంభ ధర రూ .149 కాగా, హై ఎండ్ ధర రూ. 199.

click me!