3 నెలల ఫుల్ వాలిడిటీతో బి‌ఎస్‌ఎన్‌ఎల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్... ఆన్ లిమిటెడ్ కాల్స్, మెసేజెస్ ఫ్రీ..

By S Ashok KumarFirst Published Jan 29, 2021, 3:21 PM IST
Highlights

రూ .150 కన్నా తక్కువకె  ధరకే ప్రతిరోజూ  1 జిబి డేటాను అందించే మొదటి సంస్థ బిఎస్ఎన్ఎల్. 2019 డిసెంబర్‌లో అన్ని టెలికం కంపెనీలు టారిఫ్ ప్లాన్‌లను పెంచాయి, కాని బిఎస్‌ఎన్‌ఎల్  ఎలాంటి మార్పు చేయలేదు.

ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) తాజాగా ఎక్కువ రోజుల వాలిడిటీగల ఒక కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. రూ .150 కన్నా తక్కువకె  ధరకే ప్రతిరోజూ  1 జిబి డేటాను అందించే మొదటి సంస్థ బిఎస్ఎన్ఎల్.

2019 డిసెంబర్‌లో అన్ని టెలికం కంపెనీలు టారిఫ్ ప్లాన్‌లను పెంచాయి, కాని బిఎస్‌ఎన్‌ఎల్  ఎలాంటి మార్పు చేయలేదు. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ రూ .485 ప్రీపెయిడ్  ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ తో ప్రతిరోజూ 1.5 జీబీ డేటా లభిస్తుంది. అంతేకాకుండా ఆన్ లిమిటెడ్ కాలింగ్ కూడా చేసుకోవచ్చు.

బిఎస్ఎన్ఎల్  రూ .485 ప్లాన్ ప్రయోజనాలలో ప్రతిరోజుకు 1.5 జిబి డేటా, ఇతర నెట్‌వర్క్‌లకు  కాల్స్ చేసుకోవడానికి ప్రతిరోజూ 250 నిమిషాలు టాక్ టైమ్ పొందుతారు. ఈ ప్రణాళికలో ప్రతిరోజూ 100 ఎస్‌ఎం‌ఎస్ లు కూడా అందుబాటులో ఉంటాయి.

ఈ ప్రణాళిక వాలిడిటీ 90 రోజులు. ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఇతర ప్రైవేట్ టెలికాం కంపెనీలు  3 నెలల ప్లాన్ వాలిడిటీని  84 రోజులు మాత్రమే అందిస్తున్నాయని కానీ ఈ బి‌ఎస్‌ఎన్‌ఎల్ ప్లాన్ ద్వారా మీకు అదనంగా మరో 6 రోజుల వాలిడిటీ వస్తుంది.

also read 

ఎయిర్ టెల్  రూ .598 ప్లాన్
బిఎస్ఎన్ఎల్ రూ .485 ప్లాన్ పోటీగా ఎయిర్ టెల్  3 నెలల ప్లాన్ కూడా ఉంది, దీని ధర రూ .598. ఈ ఎయిర్ టెల్  ప్లాన్ వాలిడిటీ 84 రోజులు. ఈ ప్లాన్ కూడా బిఎస్ఎన్ఎల్ లాగానే ప్రతిరోజూ 1.5 జిబి డేటా ఇస్తుంది. అన్ని నెట్‌వర్క్‌లకు  ఆన్ లిమిటెడ్ కాలింగ్ చేసుకోవచ్చు. ఇక జియోలో ప్రతిరోజూ 1.5 జిబి డేటా  అందించే ప్లాన్ కూడా ఉంది, దీని వాలిడిటీ 84 రోజులు, ఈ ప్లాన్ ధర 555 రూపాయలు.

ఇటీవల రిపబ్లిక్ డే దినోత్సవం సందర్భంగా, బిఎస్ఎన్ఎల్ రెండు కొత్త ప్లాన్ల వాలిడిటీని పెంచింది. బిఎస్‌ఎన్‌ఎల్  ప్లాన్ వాలిడిటీ పెంపు అందుకున్న ప్లాన్లలో రూ .2,399, రూ .1,999 ఉన్నాయి. ఇది కాకుండా 30 రోజుల వాలిడిటీతో ఎస్‌టివీ 398 ప్లాన్ ను కూడా ప్రవేశపెట్టింది. 

ఈ మూడు ప్లాన్‌లలో బిఎస్‌ఎన్‌ఎల్ ఎఫ్‌యుపి పరిమితిని తొలగిస్తు  అతిపెద్ద నిర్ణయం తీసుకుంది, అంటే మీకు కాల్స్ చేయడానికి రోజు  నిమిషాల పరిమితి ఉండదు. పూర్తిగా ఆన్ లిమిటెడ్ కాలింగ్ పొందుతారు.

click me!