హెచ్‌డి ప్లస్ ఐపిఎస్ డిస్‌ప్లేతో ఇటెల్ కొత్త స్మార్ట్‌ఫోన్.. ఫిబ్రవరి 1 న లాంచ్..

By S Ashok Kumar  |  First Published Jan 29, 2021, 2:33 PM IST

 ఇటెల్ వచ్చే వారం అంటే ఫిబ్రవరి 1న భారతదేశంలో మరో  కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతోంది. ఈ రాబోయే ఫోన్ ఫీచర్స్ గురించి పూర్తి సమాచారం అందుబాటులో లేదు.


 ఏడు కోట్లకు పైగా కస్టమర్లతో భారత బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను శాసిస్తున్న ఇటెల్ వచ్చే వారం అంటే ఫిబ్రవరి 1న భారతదేశంలో మరో  కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతోంది.

ఈ రాబోయే ఫోన్ ఫీచర్స్ గురించి పూర్తి సమాచారం అందుబాటులో లేదు, కానీ కొన్ని ఫీచర్స్  ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.

Latest Videos

ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం ఇటెల్ నుండి రాబోయే కొత్త ఫోన్‌ హెచ్‌డి ప్లస్ ఐపిఎస్ డిస్‌ప్లేతో  వస్తుంది. డిస్ ప్లే  సైజ్ 5.5 అంగుళాలు,  అమెజాన్ ఇండియా నుండి ప్రత్యేకంగా దీనిని కొనుగోలు చేయవచ్చు.

 అయితే ఈ ఫోన్ ఇటెల్ ఎ సిరీస్‌లో రాబోతున్నట్లు భావిస్తున్నారు. ఫోన్‌లో ఫేస్ అన్‌లాక్‌తో పాటు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉందని చెబుతున్నారు. ఈ ఐటెల్ ఫోన్‌ను 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్‌తో లాంచ్ చేయనున్నారు.

also read ఇండియన్ మార్కెట్లోకి అంకర్ ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్ స్టాండ్‌.. కేవలం 30 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్.....

ఇక ధర విషయానికొస్తే, ప్రస్తుతానికి ఫోన్ అసలు ధర గురించి ఎటువంటి సమాచారం లేదు, కానీ మీరు ఇటెల్ వ్యూహాన్ని పరిశీలిస్తే, దాని అన్నీ  ఫోన్లు చాలా వరకు రూ .6,000 ధర మధ్య ఉంటుంది. అలాగే ఈ ఫోన్ ధర కూడా ఈ పరిధిలో ఉండవచ్చు.

గత వారంలో  ఐటెల్ ఒక కొత్త స్మార్ట్‌ఫోన్ ఐటెల్ విజన్ 1 ప్రోను లాంచ్ చేసింది. ఇటెల్ విజన్ 1 ప్రొ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వాటర్‌డ్రాప్ నాచ్  డిస్‌ప్లేతో  ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ గా వచ్చింది.

అంతే కాకుండా, పెద్ద 4000 mAh బ్యాటరీని ఇటెల్ విజన్ 1 ప్రొ లో అందించారు. ఐటెల్ విజన్ 1 ప్రో  సింగిల్ ర్యామ్, స్టోరేజ్ వేరియంట్లో లభిస్తుంది. ఇటెల్ విజన్ 1 ప్రొ ధర 6,599 రూపాయలు.

 ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఆండ్రాయిడ్ గో (10) ఈ ఫోన్‌లో లభిస్తుంది. ఫోన్‌లో 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ తో క్వాడ్ కోర్ ప్రాసెసర్ అందించారు, మీరు మెమరీ కార్డ్ సహాయంతో  స్టోరేజ్  మరింత పెంచవచ్చు.

కెమెరా గురించి చెప్పాలంటే ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది, దీనిలో ప్రధాన లెన్స్ 8 మెగాపిక్సెల్స్  కెమెరా, మిగతా రెండు లెన్సులు వి‌జి‌ఏ కెమెరా, కెమెరాతో ఫ్లాష్ లైట్ కూడా ఉంది. ముందు భాగంలో ఫేస్ అన్‌లాక్ సపోర్ట్‌తో 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా లభిస్తుంది. 
 

click me!