ఫెస్టివల్ సీజన్ సందర్భంగా 'ది బిగ్ బిలియన్ డేస్ సేల్' లో ఫ్లిప్ కార్ట్, అమెజాన్ తన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. ఫ్లిప్ కార్టు అన్ని ఉత్పత్తులపై ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యుల కోసం 90 శాతం డిస్కౌంట్ 28, 29 తేదీల్లో ఉదయం 8 గంటలనుంచే అందుబాటులోకి తెచ్చింది. యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంకు కార్డు కొనుగోళ్లపై 10శాతం ఆఫర్ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఫ్లిప్ కార్ట్ అందిస్తోంది. మరోవైపు అమెజాన్ కూడా తన ఫ్రైమ్ సభ్యులకు 28 నుంచే ఆఫర్లు అందుబాటులోకి తెచ్చింది.
ఆన్‌లైన్ రిటైల్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఫెస్టివల్ సేల్‌కు మరోసారి తెర తీశాయి. ఇటు 'ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్', అటు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ ఆఫర్ల కోలాహలం ఆదివారం ప్రారంభమై అక్టోబర్ 4 వరకు ఉంటుంది.
అలాగే ఫ్లిప్‌కార్ట్ ప్లస్, అమెజాన్ ఫ్రైమ్ తమ సభ్యుల కోసం 28, 29 తేదీల్లో ఉదయం 8 గంటల నుంచే ఈ ఆఫర్ ముందుగా అందుబాటులోకి తీసుకొచ్చాయి. అమెజాన్ టీవీలపై 60 శాతం వరకు రాయితీలు అందుబాటులో ఉంచింది.
undefined
ఆరు రోజుల గ్రాండ్ షాపింగ్ ఫెస్టివల్ సేలక్ష వివిధ గృహోపరకరణాలు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లపై భారీ అఫర్లను (90శాతం) అందిస్తోంది. రియల్‌మి, ఆసుస్, గూగుల్, లెనోవా మోటరోలా, వివో, మోటో జీ7, మోటరోలా వన్‌విజన్, లెనోవా జెడ్ 6ప్రొ, కే10 నోట్ ,తదితర డివైస్‌ల పై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నది.
శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్9 ప్లస్ కూడా తగ్గింపు ధరలో అందిస్తోంది ఫ్లిప్ కార్ట్. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లకు మాత్రమే కాక మిడ్-రేంజ్, ప్రీమియం వాటికి కూడా వర్తిస్తుంది. అలాగే యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డు కొనుగోళ్లపై 10శాతం డిస్కౌంట్ అదనం. రూ.2,000 ఎక్స్చేంజ్‌తోపాటు మొబైల్ ప్రొటెక్షన్ లాంటి ఆఫర్లు కూడా ఉన్నాయి.
దీనికి తోడు 'ది బిగ్ బిలియన్ డేస్ సేల్' ఆఫర్లలో భాగంగా లెనోవో జెడ్ 6 ప్రొ రూ.2000 తగ్గింపుతో రూ. 31,999 లకే అందుబాటులో ఉండనుంది. లెనోవో ఏ 6 నోట్‌పై రూ.1000 తగ్గుతుండగా, రియల్‌మి 5 ప్రో -1,000 రూపాయల తగ్గింపు లభిస్తోంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో రూ.1,000 అదనపు తగ్గింపు లభిస్తుంది.
ఇంకా రియల్‌మీ తన స్మార్ట్‌ఫోన్లలోని రియల్‌మీ 5, రియల్‌మీ ఎక్స్‌టీ, రియల్‌మీ ఎక్స్, రియల్‌మీ 3ఐను వరుసగా రూ. 8,999, రూ. 15,999, రూ. 15,999, 7,999 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. ఎంట్రీ-సెగ్మెంట్ రియల్‌మీ స్మార్ట్‌ఫోన్ రియల్‌మి 5 (క్వాడ్-కెమెరా) రూ 2 వేల తగ్గింపుతో రూ. 8,999లకే పొందవచ్చు.
మరోవైపు రెడ్ మీ నోట్ 7ఎస్ ఫోన్లలో 3జీబీ విత్ 32 జీబీ వేరియంట్ ఫోన్ ధర రూ.3000 తగ్గి రూ.8,999లకు, 4జీబీ విత్ 64 జీబీ ఫోన్ రూ.4000 తగ్గించి రూ.9999లకే అందుబాటులోకి తెచ్చారు. నోకియా 6.1 (4జీబీ) ఫోన్ రూ.8600 తగ్గింపుతో రూ.8999లకు, నోకియా 5.1 ప్లస్ (3జీబీ) ఫోన్ రూ.13,999 నుంచి రూ.6,999లకు తగ్గించి వేశారు.
రెడ్ మీ నోట్ 7 ప్రో ఫోన్ 4జీబీ విత్ 64 జీబీ రూ.15,999 నుంచి రూ.10,999లకు, 6జీబీ విత్ 64 జీబీ వేరియంట్ ధర రూ.16,999 నుంచి రూ.13,999లకు, 6జీబీ విత్ 128 జీబీ వేరియంట్ ధర రూ.17,999 నుంచి రూ.14,999లకే అందుబాటులోకి తెచ్చింది ఫ్లిప్ కార్ట్.
ఇంకా రెడ్ మీ నోట్ 5 ప్రో ధర రూ.16,999 నుంచి రూ.10,999లకు, రెడ్ మీ నోట్ 6 ప్రో ఫోన్ 6జీబీ విత్ 64 జీబీ వేరియంట్ ధర రూ.11,999లకు, వివో జడ్ 1 ప్రో ఫోన్ రూ.12990లకే లభిస్తోంది.
రూ.20 వేల లోపు ఫోన్లలో పొకో ఎఫ్1 ఫోన్ ధర రూ.21,999 నుంచి రూ.14,999లకు, శామ్ సంగ్ ఎ50 ఫోన్ రూ.21 వేల నుంచి రూ.16,999లకు, రెడ్ మీ కే 20 ఫోన్ రూ.22,999 నుంచి రూ.19,999లకు తగ్గాయి.
ఫ్లిప్ కార్ట్ లో రూ.20 వేలు దాటిన ఫోన్లలో రెడ్ మీ కే 20 ప్రో ఫోన్ రూ.28,999 నుంచి రూ.24,999లకు, అసుస్ 6జడ్ ఫోన్ రూ.35,999 నుంచి రూ.27,999లకు తగ్గించి అమ్ముతున్నారు. ఇక ఎల్ జీ వీ 40 థిన్ క్యూ (6జీబీ) ఫోన్ ధర రూ.60 వేలు అయితే రూ.29,999లకు, పిక్సెల్ 3ఏ ఫోన్ ధర రూ.45 వేల నుంచి రూ.29,999లకు అందుబాటులోకి తెచ్చింది.
ఇక అమెజాన్ నుంచి రూ.10 వేల లోపు ధర గల ఫోన్లలో శామ్ సంగ్ గెలాక్సీ ఎం 30 ట్రిపుల్ కెమెరా ఫోన్ రూ.11 వేల నుంచి రూ.9,999లకే లభిస్తుంది. హానర్ 8ఎక్స్ ఫోన్ ధర రూ.17,999 నుంచి రూ.9999లకు, నోకియా 6.1 ప్లస్ ఫోన్ ధర ఏకంగా రూ.20,499 నుంచి రూ.9999కి పడిపోయాయి.
ఇక శామ్ సంగ్ గెలాక్సీ ఎం 20 ఫోన్ ధర రూ.11,290 నుంచి రూ.9999లకు, హానర్ 9ఎన్ ధర రూ.15,999 నుంచి రూ.8,499లకు, ఒప్పో ఎ7 ధర రూ.16,990 నుంచి రూ.9990లకు, ఒప్పో ఎ5ఎస్ ధర రూ.13,990 నుంచి రూ.9,990లకు లభిస్తుంది.
ఇంకా స్పెషల్ ఫెస్టివల్ లాంచ్ శామ్ సంగ్ గెలాక్సీ ఎం 10 ఎస్ ధర రూ.8,999గా నిర్ణయించగా, వివో యూ10 ఫోన్ రూ. 8,990, శామ్ సంగ్ గెలాక్సీ ఎం10 ఫోన్ రూ.9,290 నుంచి రూ.7,999లకు, రెడ్ మీ వై3 ఫోన్ ధర రూ.11,999 నుంచి రూ.7,999లకు పడిపోయాయి.
ఎల్జీ డబ్ల్యూ30 ఫోన్ రూ.10 వేల నుంచి రూ.7999, రియల్ మీ యూ1 ఫోన్ ధర రూ.12,999 నుంచి రూ.7,999లకు తగ్గాయి. వివో వై 90 ఫోన్ రూ. 7990 నుంచి రూ.6990 లకు, హానర్ 8సీ ఫోన్ రూ.14,999 నుంచి రూ.8,999లకు, రెడ్ మీ 7ఎ ఫోన్ రూ.6,499 నుంచి రూ.4,449లకు తగ్గిపోయింది.
రూ.10 వేల నుంచి రూ.16 వేల లోపు ధర గల ఫోన్ల జాబితాలోకి శామ్ సంగ్ గెలాక్సీ ఎం 30.. 4జీబీ విత్ 64 జీబీ (రూ.11,999), వివో వై 15 (రూ.12,990), షియోమీ ఎం ఎ3 (రూ.12,999), ఒప్పో ఎ5 2020 (రూ.13,990), శామ్ సంగ్ గెలాక్సీ ఎం30ఎస్ (రూ.13,999), వివో వీ 15 ప్లస్ ఒప్పో కే3, హువావే వై9 ప్రైమ్, ఒప్పో కే3 ఫోన్లు (రూ.15,990) లభిస్తాయి.
రూ.20 వేలపై చిలుకు ధర గల ఫోన్లలో వన్ ప్లస్ 7 ఫోన్ 32,999 నుంచి రూ.29,999, వివో వీ 17 ప్రో ఫోన్ రూ.32,990 నుంచి రూ.29,990కుి తగ్గిపోయింది. ఒప్పో రెనో2 జడ్ ఫోన్ ధర రూ.32,990 నుంచి రూ.29,990, శామ్ సంగ్ గెలాక్సీ ఎ70 ఫోన్ ధర రూ.30,900 నుంచి రూ.28,990లకు పడిపోయాయి.
అమెజాన్ స్పెషల్స్‌లో వన్ ప్లస్ 7టీ ఫోన్ ధర రూ.37,999 నుంచి మొదలవుతుంది. నో ఈఎంఐ కాస్ట్, ఎక్స్చేంజ్ ఆఫర్, ఫ్రీ స్క్రీన్ రీప్లేస్ మెంట్ ఉన్నాయి. వన్ ప్లస్ 7 ప్రో ఫోన్ రూ.48,999 నుంచి రూ.44,999కి, శామ్ సంగ్ గెలాక్సీ నోట్ 9 ఫోన్ ధర రూ.73,600 నుంచి రూ.42,999లకు తగ్గించి విక్రయిస్తున్నారు.
హువావే మేట్ 20 ప్రో ఫోన్ ధర రూ.79,990 నుంచి రూ.49,990లకు లభిస్తుండగా, రూ.20,990 విలువ గల జీటీ ఫార్ములా ఫ్రీ వాచ్ లభిస్తుంది. శామ్ సంగ్ గెలాక్సీ నోట్ 10 ధర రూ.75 వేల నుంచి రూ.69,999లకు తగ్గించేశారు.