ఎండ మండిపోతుందా..ఏసీ హెల్మెట్లు వచ్చేస్తున్నాయి

First Published 31, Aug 2018, 2:33 PM IST
Highlights

వాతావరణంలో మార్పుల దృష్ట్యా అన్ని కాలాల్లోనూ ఎండలు మండిపోతున్నాయి. రోడ్డుపై వెళ్లాలంటే హెల్మెట్ తప్పనిసరి అని పోలీసులు హెచ్చరికలు.. హద్దు మీరితే భారీ జరిమానాలు.. హెల్మెట్ పెట్టుకుందామంటే బయట ఒకటే వేడి. హెల్మెట్లకు ఏసీ వుంటే ఎంత బాగుండు అనిపించక మానదు

వాతావరణంలో మార్పుల దృష్ట్యా అన్ని కాలాల్లోనూ ఎండలు మండిపోతున్నాయి. రోడ్డుపై వెళ్లాలంటే హెల్మెట్ తప్పనిసరి అని పోలీసులు హెచ్చరికలు.. హద్దు మీరితే భారీ జరిమానాలు.. హెల్మెట్ పెట్టుకుందామంటే బయట ఒకటే వేడి. హెల్మెట్లకు ఏసీ వుంటే ఎంత బాగుండు అనిపించక మానదు. ఇలాంటి వారి కోసమే ఏసీ హెల్మెట్లు అందుబాటులోకి వస్తున్నాయి.

ఫెహెర్ సంస్థ ప్రపంచంలోనే తొలిసారిగా ఇంటిగ్రేటెడ్ ఏసీ యూనిట్‌తో ఏసీహెచ్‌-1 పేరిట ఓ హెల్మెట్‌ను రూపొందించింది. మండిపోయే ఎండలో బైక్ నడిపే వ్యక్తికి ఇది చల్లదనాన్ని అందిస్తుంది. ఏసీ వల్ల అతడి ముఖం తేమగా మారే ప్రమాదం ఉండటం వల్ల.. కేవలం తల భాగానికి మాత్రమే చల్లదనం అందే విధంగా హెల్మెట్‌ను డిజైన్ చేశారు.

బైక్ బ్యాటరీతో ఇది పనిచేస్తుంది.. దీని బరువు 1.45 కేజీలు, ఫైబర్ మ్యాట్‌తో పాటు ఫైబర్ గ్లాస్‌‌ను ఉపయోగించడం వల్ల హెల్మెట్‌ను తక్కువ బరువులోనే రూపొందించగలిగారు. దీనిన భద్రపరిచేందుకు బ్యాగ్‌ కూడా ఇచ్చారు.... ఈ హెల్మెట్ ధర 549 డాలర్లు( రూ.40 వేలు).

Last Updated 9, Sep 2018, 11:48 AM IST