ఎలాన్ మస్క్ ట్విట్టర్ డీల్ : మార్చి నుండి అక్టోబర్ వరకు ఏం జరిగిందంటే..?

By asianet news telugu  |  First Published Oct 28, 2022, 12:21 PM IST

మైక్రో-బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ఇప్పుడు ఎలోన్ మస్క్‌ సొంతమైంది. ట్విట్టర్ ని సొంతం చేసుకున్న కొద్దిసేపటికే ఎలోన్ మస్క్ ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్‌తో సహా చాలా మంది ఉన్నతాధికారులను తొలగించారు.  


ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఎలాన్ మస్క్ ట్విట్టర్ మధ్య గత తొమ్మిది నెలలుగా సాగుతున్న పోరు ఎట్టకేలకు ముగిసింది. మైక్రో-బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ఇప్పుడు ఎలోన్ మస్క్‌ సొంతమైంది. ట్విట్టర్ ని సొంతం చేసుకున్న కొద్దిసేపటికే ఎలోన్ మస్క్ ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్‌తో సహా చాలా మంది ఉన్నతాధికారులను తొలగించారు.  

అయితే ఈ ట్విట్టర్ డీల్ అంత సులభంగా ముగియలేదు. ఎలోన్ మస్క్ పదేపదే ఒప్పందాలతో U-టర్న్ చేయడం కూడా ట్విట్టర్‌కి కాస్త ఇబ్బంది ఎదురైంది. చివరికి ట్విట్టర్ కోర్టును ఆశ్రయించడంతో ఈ సెటిల్ మెంట్ పూర్తయ్యింది. ఈ డీల్ ఎప్పుడు ప్రారంభమైంది ? ఎలోన్ మస్క్ ఎందుకు వెనక్కి తగ్గాడు ? కోర్టులో ఏం జరిగింది, చివరికి ఎలోన్ మస్క్ ఎందుకు డీల్ క్లోజ్ చేయవల్సి వచ్చిందో తెలుసుకోండి..

Latest Videos

undefined

ఎలోన్ మస్క్  ట్విట్టర్ మధ్య డీల్  ఈ సంవత్సరం మార్చిలో ప్రారంభమైంది. నిజానికి ఎలోన్ మస్క్ తన ట్వీట్లలో  స్వేచ్ఛకు సంబంధించి ట్విట్టర్ విధానాలను ప్రశ్నించాడు. ఈ సందర్భంగా కొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ను రూపొందించాలని కూడా సూచించారు. 

  9.2 శాతం షేర్లకు అధినేత 
కొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ను తీసుకురావాలని సూచించిన తర్వాత ప్రజలు ట్విట్టర్‌ని కొనుగోలు చేయాలని ఎలోన్ మస్క్‌కి సూచించారు. ఆ తర్వాత 4 ఏప్రిల్ 2022న ఎలోన మస్క్ కంపెనీలో 9.2 శాతం వాటాను తీసుకున్నట్లు ట్విట్టర్ ప్రకటించింది, అయితే మార్చి 4 నాటి షేర్ ధర ఆధారంగా  9.2 శాతం షేర్లకు సుమారు $2.9 బిలియన్లు.

ట్విట్టర్ బోర్డులో  
ఎలోన్ మస్క్ కంపెనీలో వాటాను అనుసరించి  5 ఏప్రిల్ 2022న ట్విట్టర్ బోర్డులో చేరారు. ఎలోన్ మస్క్‌ను ట్విట్టర్ బోర్డులో నియమిస్తున్నట్లు ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ వరుస ట్వీట్లలో ప్రకటించారు. 

ఎలోన్ మస్క్ U-టర్న్
ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్ ప్రకటన చేసిన కొద్ది రోజుల తర్వాత ఎలోన్ మస్క్ ట్విట్టర్ బోర్డులో చేరడానికి నిరాకరించాడు. 

 ఎలోన్ మస్క్ ట్విట్టర్ బోర్డులో చేరడానికి నిరాకరించిన తర్వాత ఏప్రిల్ 14న మొత్తం ట్విట్టర్ ని కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చాడు. ట్విట్టర్ ఒక్కో షేరును $54.20 చొప్పున $43 బిలియన్లకు కొనుగోలు చేసేందుకు ఆఫర్ చేశాడు. ఆ తర్వాత ఈ డీల్ వాటాదారులచే ఆమోదించబడింది. 

 ఈ ఒప్పందం తర్వాత  ఐదు శాతం మంది ట్విటర్‌ యూజర్లు స్పామ్‌లేనని పేర్కొన్నారు. దీనికి సంబంధించి ట్విట్టర్ నుండి సమాచారాన్ని కోరగా ట్విట్టర్ నిరాకరించడంతో జూలై 9న డీల్ నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. 

కోర్టు తలుపు తట్టిన ట్విట్టర్ 
ఎలోన్ మస్క్ యు-టర్న్ తర్వాత ట్విట్టర్ కోర్టును ఆశ్రయించింది. ఒప్పందం ప్రకారం తమ బాధ్యతలను ఉల్లంఘించలేదని, ఈ వివాదం మైక్రో బ్లాగింగ్ సైట్ వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నందున వీలైనంత త్వరగా డీల్ పూర్తి చేయాలని ట్విట్టర్ పేర్కొంది.
 
 కోర్టులో ఇరుపక్షాల సుదీర్ఘ వాదనల అనంతరం అక్టోబర్ 17 నుంచి కేసు విచారణ మొదలైంది. దీని తరువాత, డెలావేర్ కోర్టు అక్టోబర్ 28 నాటికి ట్విట్టర్ డీల్ పూర్తి చేయాలని ఆదేశించింది. 

click me!