ఆపిల్ కొత్త ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో ఇంకా ఐఫోన్ 14 ప్రో మాక్స్‌తో కొత్త శాటిలైట్ ఎమర్జెన్సీ సర్వీస్‌ను పరిచయం చేసింది. మొదటి రెండేళ్లపాటు ఈ సర్వీస్‌ను ఉచితంగా అందించనున్నట్లు కంపెనీ తెలిపింది.
టెక్ దిగ్గజం ఆపిల్ శాటిలైట్ ఎమర్జెన్సీ ఎస్‌ఓఎస్ సర్వీస్ విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు అమెరికాతో పాటు ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్ ఇంకా యూకే యూజర్లు కూడా ఐఫోన్ 14 సిరీస్‌తో శాటిలైట్ ఎమర్జెన్సీ SOS సర్వీస్ ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈ టెక్నాలజి సహాయంతో వినియోగదారులు సెల్యులార్ అండ్ Wi-Fi కవరేజీకి బయట ఉన్నప్పుడు కూడా ఆపిల్ అత్యవసర సేవకు శాటిలైట్ సహాయంతో మెసేజెస్ పంపవచ్చని వివరించింది.
ఆపిల్ కొత్త ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో ఇంకా ఐఫోన్ 14 ప్రో మాక్స్‌తో కొత్త శాటిలైట్ ఎమర్జెన్సీ సర్వీస్‌ను పరిచయం చేసింది. మొదటి రెండేళ్లపాటు ఈ సర్వీస్‌ను ఉచితంగా అందించనున్నట్లు కంపెనీ తెలిపింది. Apple కొత్త శాటిలైట్ ఎమర్జెన్సీ సర్వీస్ iOS 16.1 లేదా పై వెర్షన్‌తో పనిచేస్తుంది. శాటిలైట్ ద్వారా వినియోగదారులు 15 సెకన్లలోపు ఎమర్జెన్సీ SOSతో మెసేజెస్ పంపవచ్చు ఇంకా పొందవచ్చు.
శాటిలైట్ కనెక్టివిటీ ఎలా పని చేస్తుంది?
శాటిలైట్ నెట్‌వర్క్ ద్వారా మొబైల్ టవర్ లేనప్పటికీ స్మార్ట్‌ఫోన్ నేరుగా శాటిలైట్ ద్వారా నెట్‌వర్క్ కనెక్టివిటీని పొందుతుంది. ఈ ప్రక్రియలో స్మార్ట్‌ఫోన్ లో-ఎర్త్ ఆర్బిట్ (LEO) శాటిలైట్ తో కమ్యూనికేట్ చేస్తుంది అలాగే ఫైండ్ మై యాప్‌ని ఉపయోగించి అత్యవసర సేవా ప్రొవైడర్ తో దాని లొకేషన్ షేర్ చేసుకోవచ్చు లేదా కాల్-మెసేజ్ ద్వారా నేరుగా వారిని కాంటాక్ట్ చేయవచ్చు. అంటే, ఫోన్‌లోని నెట్‌వర్క్ కనెక్టివిటీ కారణంగా, వినియోగదారులు మొబైల్ టవర్ నుండి నెట్‌వర్క్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, బదులుగా వినియోగదారులు నెట్‌వర్క్ లేకుండా కాల్ అండ్ మెసేజ్ చేయవచ్చు.
మారుమూల ప్రాంతాల్లోని మొబైల్ టవర్ల నుండి నెట్‌వర్క్ కనెక్టివిటీని పొందడం కష్టంగా ఉన్నప్పుడు శాటిలైట్ నెట్‌వర్క్‌లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇందులో స్మార్ట్‌ఫోన్‌లో సెల్యులార్ నెట్‌వర్క్ లేకుండా కూడా శాటిలైట్ కనెక్టివిటీ సహాయంతో వినియోగదారులు కాల్‌లు అండ్ సందేశాలను చేయవచ్చు.