అమేజాన్ యాప్ వాడుతున్నారా...అయితే మీకో గుడ్ న్యూస్

By Sandra Ashok KumarFirst Published Nov 4, 2019, 3:17 PM IST
Highlights

అమెజాన్ బుక్‌మైషో తో జతకట్టి  భారతదేశంలో సినిమా టికెట్లను అమ్మడానికి  సిద్దమైంది. మూవీ టికెట్ బుకింగ్ ప్రస్తుతం అమెజాన్ యాప్ లేదా మొబైల్ వెబ్‌సైట్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంది.   

అమెజాన్ ఇండియా యూజర్లు ఇప్పుడు అమెజాన్  యాప్ ఉపయోగించి సినిమా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ-కామర్స్ దిగ్గజం బుక్‌మై షోతో భాగస్వామ్యం చేసుకుంది. ఈ కొత్త సేవను దాని ప్రైమ్‌తో పాటు ప్రైమ్-కాని సభ్యులకు కూడా ఈ సేవ  అందించింది.  యాప్ లో ‘షాపింగ్ బై కేటగిరీ’ విభాగంలో అమెజాన్ పే టాబ్ లోపల కొత్తగా ‘మూవీ టికెట్లు’ ఆప్షన్ వచ్చింది.

ఈ కొత్త సేవ వినియోగదారులకు సినిమా టిక్కెట్లను కొనుగోలు చేయటమే కాకుండా, రివ్యూ, సినిమా రేటింగ్‌లతో సహా బుక్‌ మైషో నుండి ఇతర కంటెంట్‌ను కూడా అందిస్తుంది. అమెజాన్ ఇండియా ఇప్పటికే విమాన టిక్కెట్లను బుక్ చేసుకోవడం, బిల్లు చెల్లించడం, మొబైల్ రీఛార్జిలు చేయడం వంటి సౌకర్యాన్ని అందిస్తుంది మరి ఇప్పుడు ఇది వినోద విభాగంలోకి కూడా ప్రవేశించింది అని చెప్పొచ్చు.

also read యాపిల్ తో సమరానికి గూగుల్ 'సై'...


ఈ సేవ ప్రస్తుతం యాప్ లేదా మొబైల్ సైట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. డెస్క్‌టాప్ వినియోగదారులు ప్రస్తుతం సినిమా టిక్కెట్ల కొనుగోలు అందుబాటులోలేదు. కొత్త ‘మూవీ టికెట్లు’ ఆప్షన్ ‘షాప్  బై కేటగిరీ’ విభాగంలో లేదా అమెజాన్ పే టాబ్‌లో చూడవచ్చు. ఎంపికపై క్లిక్ చేస్తే మీ ప్రాంతం, మీ ఖచ్చితమైన జోన్ ఇంకా మీకు నచ్చిన సినిమాని ఎంచుకోమని అడుగుతుంది. 

ఆ తర్వాత మీరు సినిమా థియేటర్, మీరు ఇష్టపడే షో టైమ్,  ప్రతి సీటుకు రేట్లు ఎంచుకోవచ్చు. మీరు బుక్‌మై షోలో మాదిరిగానే సీట్లను ఎంచుకోవచ్చు, ఆపై చెల్లింపు కోసం దీనిలో మీరు అమెజాన్ పే లేదా ఇతర డిజిటల్ పద్ధతులను ఉపయోగించి చెల్లించవచ్చు.

 చెల్లింపు సమయంలో అమెజాన్ పే బ్యాలెన్స్, అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్, అమెజాన్ పే యుపిఐ లేదా ఇతర డిజిటల్ చెల్లింపు పద్ధతులు కూడా ఇందులో ఉన్నాయి. ఐసిఐసిఐ అమెజాన్ పే క్రెడిట్ కార్డ్ కస్టమర్లు అమెజాన్.ఇన్ లో సినిమా టిక్కెట్లను కొనుగోలు చేసినప్పుడు నెలవారీ స్టేట్మెంట్ రివార్డులుగా 2 శాతం క్యాష్‌బ్యాక్ కూడ పొందుతారు.

also read ఇక ఇన్‌కమింగ్ కాల్...30 సెకన్లు మాత్రమే: ట్రాయ్ నిర్ణయం

లాంచ్ ఆఫర్‌లో భాగంగా అమెజాన్ మూవీ టికెట్ బుకింగ్‌పై 20 శాతం క్యాష్‌బ్యాక్‌ అందిస్తుంది. ఈ ఆఫర్ వినియోగదారుకు ఒకసారి మాత్రమే చెల్లుతుంది. బుకింగ్ ముగింపులో, వినియోగదారు భవిష్యత్తులో ఉపయోగం కోసం టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోగలరు.


"అమెజాన్.ఇన్ లో కొత్త కేటగిరీగా హోంలో సినిమా వినోదాన్ని తెరవడానికి బుక్‌ మైషోతో భాగస్వామ్యం కావడం మాకు సంతోషంగా ఉంది, మా కస్టమర్ల జీవితాలను సాధ్యమైన ప్రతి విధంగా సులభం చేయడమే మా లక్ష్యం" అని అమెజాన్ పే డైరెక్టర్ మహేంద్ర నెరుర్కర్ ఒక ప్రకటనలో తెలిపారు.
 

click me!