ఉద్యోగుల స్వచ్చంద పదవీ విరమణపైనే కేంద్రం ప్రియారిటీ

By Sandra Ashok KumarFirst Published Nov 4, 2019, 2:37 PM IST
Highlights

బీఎస్ఎన్ఎల్‌లో ఎంటీఎన్ఎల్ విలీనం ప్రక్రియలో రెండు సంస్థల్లో 55 ఏళ్లు దాటిన ఉద్యోగుల పదవీ విరమణకు వీఆర్ఎస్ అమలు చేయడానికే కేంద్రం ప్రాధాన్యం ఇస్తున్నది. ఈ పథకం అమలు తీరు తెన్నులను కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ నేరుగా పర్యవేక్షించనున్నారు.
 

న్యూఢిల్లీ: భారత సంచార్ నిగం లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)లో మహా నగర్ సంచార్ లిమిటెడ్ (ఎంటీఎన్ఎల్)ను విలీనం చేయాలని కేంద్రం సూత్రప్రాయంగా నిర్ణయించింది. అయితే రెండు సంస్థల్లో ఉద్యోగుల స్వచ్చంద పదవీ విరమణకే సత్వర చర్యలు చేపట్టాలని మంత్రి రవి శంకర్ ప్రసాద్ సూచించారు.

also read  షియోమీ మెగా ఈవెంట్​.. ఒకేసారి 5 డివైజ్​ల ఆవిష్కరణ

సిబ్బంది వీఆర్ఎస్ మార్గదర్శకాలు త్వరితగతిన నిర్దేశించుకుని అమలు చేయాలని.. అదే సమయంలో ఆస్తుల విక్రయానికి గడువు పెట్టుకుని ముందుకు సాగాలని సూచించారు. టెలికం రంగంలో మరింత దూసుకెళ్లాలని పేర్కొన్నారు. రెండు సంస్థల బోర్డులతో జరిగిన సమావేశంలో ఈయన ఈ వ్యాఖ్యలు చేశారని సమాచారం.

ప్రభుత్వ రంగ టెలికం సంస్థలు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్‌లకు సంయుక్తంగా రూ.60 వేల కోట్ల పునరుద్ధరణ పథకం అందచేసిందని ఆ బోర్డుల సమావేశాల్లో రవిశంకర్ ప్రసాద్ చెప్పినట్లు తెలుస్తోంది. మార్గదర్శకాలు సాధ్యమైనంత తర్వగా ఖరారు చేసి, సానుకూల దిశగా అమలు చేయాలని సూచించారు.

ఇక వీఆర్ఎస్ పథకం అమలు తీరు తెన్నులను మంత్రి రవిశంకర్ ప్రసాద్ నేరుగా పర్యవేక్షించనున్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది, అధికారులతో రెండు సంస్థల ఉన్నతాధికారులు సమావేశమై వారిని సమాయత్తం చేయాల్సి ఉంటుంది. ఆస్తుల విక్రయానికి వేగవంతంగా చర్యలు తీసుకుని, వచ్చే మూడేళ్లలో రూ.37,500 కోట్లు సమకూర్చుకోవాల్సి ఉంటుందన్నారు. 

also read యాపిల్ తో సమరానికి గూగుల్ 'సై'...

బీఎస్ఎన్ఎల్-ఎంటీఎన్ఎల్ విలీనంతోపాటు 4జీ స్పెక్ట్రం కోసం రూ.20,140 కోట్లు, జీఎస్టీ కోసం రూ.3,674 కోట్ల పెట్టుబడి సాయం, రూ.15 వేల కోట్ల రుణ సమీకరణకు ప్రభుత్వం హామీ ఇవ్వనున్నది. సీబ్బంది వీఆర్ఎస్ పథకానికి రూ.12,768 కోట్లు, పదవీ విరమణ బాధ్యతలకు రూ.17,160 కోట్లు కేటాయించనున్నది. 
 

click me!