పోస్ట్ పెయిడ్ కష్టమర్లకు ఎయిర్ టెల్ సూపర్ ఆఫర్

Published : Jul 09, 2018, 11:35 AM IST
పోస్ట్ పెయిడ్ కష్టమర్లకు ఎయిర్ టెల్ సూపర్ ఆఫర్

సారాంశం

ఈసారి ప్రీపెయిడ్ కష్టమర్ల కోసం కాకుండా.. పోస్ట్ పెయిడ్ కష్టమర్లను దృష్టిలో ఉంచుకొని ఆఫర్ తీసుకువచ్చింది.

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ మరోసారి సూపర్ ఆఫర్ తీసుకువచ్చింది. కాకపోతే ఈసారి ప్రీపెయిడ్ కష్టమర్ల కోసం కాకుండా.. పోస్ట్ పెయిడ్ కష్టమర్లను దృష్టిలో ఉంచుకొని ఆఫర్ తీసుకువచ్చింది.

కొన్ని పోస్టు పెయిడ్ ప్లాన్ లలో డేటా పరిమితిని పెంచుతున్నట్లు ఎయిర్ టెల్ ప్రకటించింది. రూ.799, రూ.1199 పోస్ట్‌పెయిడ్ ప్లాన్లలో అందిస్తున్న డేటా లిమిట్‌ను పెంచింది. ఇప్పటి వరకు రూ.799 ప్లాన్‌లో 60జీబీ, రూ.1199 ప్లాన్‌లో 100 జీబీ డేటా వినియోగదారులకు లభించేవి. కానీ వాటిని పెంచారు. దీంతో ప్రస్తుతం రూ.799 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో కస్టమర్లకు 100జీబీ డేటా వస్తుంది. 

అలాగే రూ.1199 ప్లాన్‌లో 120 జీబీ డేటా వస్తుంది. ఇక ఈ ప్లాన్లలో డేటాకు గాను డేటా రోల్ ఓవర్ సౌకర్యాన్ని కూడా అందిస్తున్నారు. ఇవే కాకుండా ఈ ప్లాన్లలో అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, అమెజాన్ ప్రైమ్ ఏడాది ఉచిత సబ్‌స్క్రిప్షన్, ఉచిత వింక్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్, ఎయిర్‌టెల్ టీవీ, ఉచిత హ్యాండ్ సెట్ డ్యామేజ్ ప్రొటెక్షన్‌లను కూడా ఈ ప్లాన్లతో ఎయిర్‌టెల్ అందిస్తున్నది.

PREV
click me!

Recommended Stories

iPhone : ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 17 ప్రో, 15 ప్లస్‌పై భారీ తగ్గింపులు !
WhatsApp Tips : మీ నెంబర్ ను ఎవరైనా బ్లాక్ చేశారా..? Meta AI సాయంతో ఈజీగా తెలుసుకోండిలా