ఇండియన్లకు స్మార్ట్ ఫోన్లే లోకం.. తర్వాతి స్థానంలో కంప్యూటర్లకు చోటు

 |  First Published Jul 9, 2018, 10:36 AM IST

డిజిటల్ పరికరాల వినియోగంలో భారతీయులు ముందు ఉన్నారని ఒక సర్వే తేల్చింది. ప్రత్యేకించి స్మార్ట్ ఫోన్ల వినియోగంలో మూడింట రెండొంతుల మంది ఇండియన్లు మునిగి తేలుతున్నారు.


న్యూఢిల్లీ: భారతీయుల్లో అత్యధికులు మూడింట రెండొంతుల మంది జీవితాల్లో డిజిటల్ వస్తువులు భాగంగా మారాయి. మూడింట రెండొంతుల మంది రోజూ తమ మొబైల్.. స్మార్ట్‌ఫోన్ వాడకానికి దూరంగా ఉండటం కష్ట సాధ్యంగా ఉన్నదని ఒక అధ్యయనం తేల్చింది. అంతర్జాతీయంగా సగటున 48 శాతం మంది మొబైల్ ఫోన్ల వాడకం నుంచి తప్పుకోలేమని అంతర్జాతీయ డిజిటల్ కంటెంట్ డెలివరీ ప్లాట్‌ఫామ్ లైమ్‌లైట్ నెట్‍వర్క్ ‘ది స్టేట్ ఆఫ్ డిజిటల్ లైఫ్‌స్టైల్స్ - 2018’ అనే అంశంపై నిర్వహించిన సర్వే పేర్కొన్నది. 

ఇతర డిజిటల్ వస్తువుల వినియోగంలో మలేషియా మొదటి స్థానంలో నిలిస్తే రెండో స్థానంలో భారతీయులు ఉన్నారు. పది దేశాల్లో డిజిటల్ పరికరాల వినియోగంపై లైమ్‌లైట్ నెట్‌వర్క్ సర్వే నిర్వహించింది. భారతీయ డిజిటల్ ఫోన్ వినియోగదారుల్లో అత్యధికంగా టెక్నాలజీ వాడకంలో రెండో స్థానంలో నిలిచారు. 

Latest Videos

undefined

ప్రత్యేకించి లాప్‌టాప్, డెస్క్‌టాప్ కంప్యూటర్ల వినియోగంలో ఇండియన్లు ద్వితీయ స్థానంలో ఉన్నారు. 45 శాతం మంది వినియోగదారులు తాము ఒక్క రోజు కూడ లాప్‌టాప్ కంప్యూటర్లు, డెస్క్‌టాప్ కంప్యూటర్లు వాడకుండా ఉండలేమని చెప్పారు. అంతర్జాతీయంగా 33 శాతం మంది మాత్రం ఒక్కరోజు కూడా కంప్యూటర్లు వాడకుండా ఉండలేమన్నారు. భారతదేశంలో పరిస్థితి అందుకు భిన్నం. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశంలో 12 శాతం మంది అత్యధికంగా కంప్యూటర్లు వాడుతున్నారని లైమ్‌లైట్ నెట్‌వర్క్స్ నిర్ధారించింది.

90 శాతం మందికి పైగా భారతీయులు డిజిటల్ టెక్నాలజీ తమ జీవితాలపై సానుకూల ప్రభావం చూపుతుందని లైమ్‌లైట్ నెట్‌వర్క్స్ పేర్కొంది. 75 శాతానికి పైగా భారతీయులు తమకు నచ్చిన అంశాలను, మ్యూజిక్ వారానికి ఒకసారి డౌన్ లౌడ్ చేసుకుంటామన్నారు. ఇది ప్రపంచ దేశాల్లో అత్యధికమని లైమ్‌లైట్ నెట్‌వర్క్స్ చెప్పింది. డౌన్‌లోడ్‌లోనూ అంతర్జాతీయ సగటు కంటే 12 శాతం ఎక్కువ.

లైమ్‌లైట్ నెట్‌వర్క్స్ భారత్ అధిపతి గౌరవ్ మాలిక్ మాట్లాడుతూ భారతీయులు డిజిటల్ వస్తువుల వాడకంలో చెప్పుకోదగిన పురోగతి సాధించారన్నారు. భారతీయుల దైనందిన జీవితంలో డిజిటల్ వస్తువులు భాగం అయ్యయాన్నారు. ఇది మార్కెట్ ప్లేయర్లకు సానుకూల సంకేతం అని చెప్పారు. ఇది డిజిటల్ ఉత్పత్తుల ఉత్పాదకత పెరుగుదలకు దారి తీస్తుందని స్పష్టం చేశారు. 

ఆటో సేల్స్‌ను నిర్దేశించే స్మార్ట్ ఫోన్లు


2022 నాటికి నాలుగు చక్రాల వాహనాలు 56 లక్షలు, ద్విచక్ర వాహనాలు 3.09 కోట్లు విక్రయం అవుతాయని అంచనా వేశారు. అప్పటికల్లా ప్రతి 10 నాలుగు చక్రాల వాహనాల కొనుగోళ్లలో ఎనిమిది, 10 ద్విచక్ర వాహనాల్లో ఏడింటి కొనుగోళ్లను స్మార్ట్ ఫోన్లు నిర్దేశిస్తాయని ఫేస్ బుక్ -కేపీఎంజీ అధ్యయనంతో తేలింది. 45 శాతం ద్విచక్ర వాహనాల కొనుగోళ్లను ఫేస్‌బుక్ ప్రభావితం చేస్తుందని ‘జీరో ఫ్రిక్షన్ ఫ్యూచర్’ సర్వే తెలిపిందని ఫేస్ బుక్ ఇండియా, దక్షిణాసియా డైరెక్టర్ సందీప్ భూషణ్ తెలిపారు. 

click me!