వైద్య రంగంలో మరో అద్భుతం.. శాటిలైట్‌ ద్వారా సర్జరీ, ఎక్కడో తెలుసా?

By Narender Vaitla  |  First Published Jan 4, 2025, 2:31 PM IST

మారుతోన్న కాలంతో పాటు టెక్నాలజీ కూడా మారుతోంది. మారిన ఈ టెక్నాలజీ అన్ని రంగాలకు విస్తరిస్తోంది. ముఖ్యంగా వైద్య రంగంలో సమూల మార్పులు వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా చైనా మరో అద్భుతాన్ని సాకారం చేసింది. ప్రపంచంలోనే తొలిసారి శాటిలైట్‌ ద్వారా సర్జరీ చేసిన దేశంగా చరిత్రలోకి ఎక్కింది.. 
 


ఓవైపు వైరస్‌లతో ప్రపంచాన్ని భయపెడుతోన్న చైనా వైద్య రంగంలో అధునాత టెక్నాలజీ ఉపయోగిస్తూ అబ్బురపరుస్తోంది. టెక్నాలజీ ప్రపంచంలో టాప్‌ దేశాల్లో ఒకటిగా కొనసాగుతోన్న చైనా తాజాగా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. శాటిలైట్‌ ఆధారిత, అలస్ట్రా రిమోట్‌ సర్జరీలను విజయవంతంగా నిర్వహించింది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి దేశంగా చైనా నిలిచింది. భూమికి సుమారు 36,000 కి.మీల దూరంలో ఉన్న Apstar-6D బ్రాడ్‌బ్యాండ్ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ఉపయోగించి ఈ శస్ర్తచికిత్స చేశారు. 

ఐదు ఆపరేషన్స్‌.. 

అయితే ఈ టెక్నాలజీ ద్వారా వైద్యులు ఏకంగా 5 ఆపరేషన్స్‌ను చేశారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ జనరల్ హాస్పిటల్‌కు చెందిన వైద్యులు టిబెట్‌లోని లాసా, యునాన్‌లోని డాలీతో పాటు హైనాన్‌లోని సన్యా నుంచి రిమోట్‌గా ఐదు శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించారు. ఇలా మూడు దేశాలకు చెందిన వారికి శస్త్రచికిత్స చేశారు. బీజింగ్‌కు చెందిన వారికి దేశీయంగా అభివృద్ధి చేసిన రోబోటిక్ సర్జికల్ సిస్టమ్ సహాయంతో లివర్‌, పిత్తాశయం సర్జరీలను చేశారు. సర్జరీ తర్వాత అందరూ కోలుకున్నారని, ఆపరేషన్‌ జరిగిన మరునాడే డిశ్చార్జ్ కూడా అయ్యారని  అక్కడి స్టేట్ బ్రాడ్ కాస్టర్ తెలిపింది.

ఎవరు ఎక్కడ ఉన్నా.. 

Latest Videos

ఈ శాటిలైట్ ఆధారిత ఆపరేషన్ల ద్వారా దూరం అనేది ఇకపై సమస్య కాదు. ప్రపంచంలో ఎక్కడ ఏ మూలన ఉన్న వారికైనా అధునాతన వైద్యం అందించవచ్చు. సుదూర ప్రాంతాలను అవలీలగా జయించవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఆప్‌స్టార్–6డి అనే ఉపగ్రహం ద్వారా ఈ శస్త్రచికిత్స చేశారు. ఈ ఉపగ్రహాన్ని చైనా 2020లో ప్రయోగించింది. సెకన్‌కు 50 గిగాబిట్‌లను అందిచగల సామర్ధ్యం ఈ శాటిలైట్‌ సొంతం.

ఈ శాటిలైట్‌ పదేళ్లపాటు విజయవంతంగా పనిచేస్తుంది. ఆసియా ఫసిఫిక్‌ ప్రాంతాల్లో ఇది విస్త్రతమైన కవరేజీని అందిస్తుంది. విమానం, పడవలతో పాటు మారుమూల ప్రాంతాలకు బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ అందించడానికి ఇది ఉపయోపగడుతుంది. 

బీజింగ్‌లో ఉన్న రోగికి లాసా నుంచి ఆప్‌స్టార్‌ ఉపగ్రహ సహాయంతోనే కాలేయానికి ఏర్పడ్డ కణితిని తొలగించారు. శస్త్రచికిత్సకు అవసరమైన డేటాను ఎలాంటి ఆటంకం లేకుండా అందించడంలో ఈ శాటిలైట్‌ ఉపయోగపడుతుంది. ఈ శాటిలైట్‌ బేస్డ్‌ సర్జరీలతో భవిష్యత్తుల్లో ఎలాంటి ఆలస్యం లేకుండా ఆపరేషన్స్‌ చేయొచ్చని డాక్టర్లు చెబుతున్నారు. మరి ఈ టెక్నాలజీ వైద్య రంగంలో ఎలాంటి సంచలనాలకు తెర తీస్తుందో చూడాలి. 

click me!