ఐఫోన్ కొనుగోలు చేయాలని చాలా మంది భావిస్తుంటారు. జీవితంలో ఒక్కసారైనా ఐఫోన్ వాడాలనే డ్రీమ్ ఉంటుంది. అయితే ధర ఎక్కువ కావడంతో ఇష్టమున్నా ఆ ఆలోచనను విరమించుకుంటారు. అయితే ఐఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్న వారి కోసం ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే సేల్ అందుబాటులో ఉంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్‌కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బ్రాండ్ నుంచి కొత్త ఫోన్ వస్తుందంటే చాలు ఎక్కడ లేని హంగామా ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో ఐఫోన్ 16 సందడి చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ ఏడాది యాపిల్ ఐఫోన్ 16ని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే పాత మోడల్స్‌పై భారీగా డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15పై కళ్లు చెదిరే డీల్ లభిస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫోన్ అసలు ధర రూ. 69,900గా ఉంది. అయితే ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌పై 14 శాతం డిస్కౌంట్‌ను అందిస్తోంది. దీంతో ఈ ఫోన్‌ను రూ. 60,999కి సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ డిస్కౌంట్ ఇక్కడితో ఆగిపోలేదు. పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 1000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఇలా ఈ ఫోన్‌ను రూ. 59,999కి లభిస్తుంది.
ఈ ఆఫర్‌లు ఇక్కడితో ఆగిపోలేదు. మీ పాత ఫోన్‌ను ఎక్క్ఛేంజ్ చేసుకోవడం ద్వారా కూడా ఆఫర్‌ను పొందొచ్చు. మీ పాత ఫోన్ కండిషన్ ఆధారంగా గరిష్టంగా రూ. 46,950 వరకు డిస్కౌంట్‌ను పొందొచ్చు. ఒకవేళ మీ ఫోన్ కండిషన్ పర్‌ఫెక్ట్‌గా ఉంటే ఐఫోన్ 15ని రూ. 25 వేల కంటే తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఇంత తక్కువ ధరకు ఐఫోన్ 15ని దక్కించుకునే లక్కీ ఛాన్స్ మళ్లీ రాదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇక ఫీచర్ల విషయానికొస్తే ఐఫోన్ 15 ఫోన్‌లో 6.1 ఇంచెస్‌తో కూడిన్ సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లేను అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ ఏ16 బయోనిక్ చిప్, 6 కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 48 మెగాపిక్సెల్స్, 12 మెగాపిక్సెల్స్‌తో కూడిన డ్యూయల్ రెయిర్ కెమెరా సెటప్‌ను అందించారు.
అలాగే సెల్పీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 12 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. 2556 x 1179 పిక్సెల్స్ రిజల్యూషన్ ఈ స్క్రీన్ సొంతం. ఓ ఎల్‌ఈడీ టెక్నాలజీ ఈ డిస్‌ప్లే ప్రత్యేకత. ఐఓఎస్ 17 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. ఐఫోన్ 15 కెమెరాతో 4కే రిజల్యూషన్‌తో కూడిన వీడియోలను రికార్డింగ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్‌పై ఏడాది వారంటనీ కంపెనీ అందిస్తోంది.