ధోనీతో సరితూగే కీపర్....ఈ పదేళ్లలో అతడే నెంబర్‌వన్: గంగూలి

By Arun Kumar PFirst Published Nov 12, 2018, 6:07 PM IST
Highlights

టీంఇండియా ఆటగాడు వృద్దిమాన్ సాహా ఎంతో అద్భుతమైన ఆటగాడని మాజీ సారథి సౌరవ్ గంగూలీ ప్రశంసించాడు. మహేంద్ర సింగ్ తర్వాత ఆ స్థాయిలో వికెట్ కీపర్ గా రాణించే సత్తా వృద్దిమాన్ సాహాకు మాత్రమే ఉందన్నాడు. అయితే గాయాల కారణంగా అతడు ఇబ్బందులు పడుతున్నాడని...ఆ గాయాలు కూడా వికెట్ కీపింగ్ చేస్తున్నపుడే అయ్యాయని గంగూలి గుర్తు చేశారు. 

గత పదేళ్ళలో సాహా వంటి వికెట్ కీఫర్ టీంఇండియాకు దొరకలేదని...ధోనీ తర్వాత అత్యుత్తమ కీపర్ అతడేనంటూ గంగూలీ ప్రశంసల వర్షం కురిపించాడు. 2014 లో ధోనీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత టీంఇండియా తరపున వికెట్ కీపర్లుగా అవకాశం వచ్చిన వారిలో సాహానే అత్యుత్తమమైనవాడని అన్నారు.  ప్రస్తుతం  జట్టుకు దూరమైనా నెంబర్‌వన్ మాత్రం అతడేనని గంగూలి  కితాబిచ్చాడు. 

అయితే సాహా గాయాల కారణంగా జట్టుకు దూరమవడం అతడి కెరీర్ పై ప్రభావం  చూపుతోందన్నారు. వికెట్ కీఫర్ అన్నాక గాయాలపాలవడం సహజమేనని గంగూలి పేర్కొన్నారు. ప్రస్తుతం గాయం కారణంగా జట్టులో స్థానం కోల్పోయిన సాహా  త్వరలో కోలుకుని పునరాగమనం చేయాలని కోరుకుంటున్నట్లు గంగూలీ తెలిపారు. 

  భుజం నొప్పితో బాధపడుతున్న  సాహా కొద్దిరోజుల క్రితమే శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్నాడు. అందువల్ల ఇటీవల జరిగిన విండీస్ సీరిస్‌కి, త్వరలో జరగనున్న ఆస్ట్రేలియా టూర్  కి దూరమయ్యాడు. ఇలా ఏడాదిగా క్రికెట్ కు దూరమైన సాహా వచ్చే ఏడాది పునరాగమనం చేసే అవకాశం ఉంది.  

click me!