క్రికెటర్ ఇంట్లో విషాదం...గురువారం ప్రారంభమయ్యే తొలి టెస్ట్‌కు దూరం

By Arun Kumar PFirst Published Oct 2, 2018, 6:39 PM IST
Highlights

భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య గురువారం నుండి రాజ్ కోట్ వేదికగా మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభకానుంది. అయితే ఈ మ్యాచ్ ప్రారంభానికి ఒక రోజు ముందే వెస్టిండిస్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. మొదటి టెస్ట్ నుండి విండీస్ స్టార్ బౌలర్ కీమర్ రోచ్ వైదొలిగాడు. అతడి కుటుంబంలో విషాదం చోటుచేసుకోవడంతో రోచ్ స్వదేశానికి బయలుదేరాడు.  

వెస్టిండీస్ సీనియర్ పేసర్ కీమర్ రోచ్ నానమ్మ మృతిచెందడంతో అతడు భారత్ నుంచి వెస్టిండిస్ కు బయలుదేరినట్లు సమాచారం.స్వస్థలం బార్బడోస్‌లో జరిగే అంత్యక్రియల్లో రోచ్ పాల్గొననున్నాడు. ఈ కార్యక్రమాలన్ని ముగించుకుని మూడు రోజుల తర్వాత రోచ్ మళ్లీ ఇండియాకు వచ్చి జట్టుతో కలవనున్నాడని విండీస్ కోచ్ స్టువర్ట్ లా ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో రాజ్ కోట్ లో జరగనున్న మొదటి టెస్ట్ కు అతడు దూరం కానున్నట్లు స్టువర్ట్ వెల్లడించాడు.

ప్రస్తుతం మంచి ఫామ్ లో వున్న రోచ్ దూరమవడం విండీస్ కు కాస్త ఇబ్బంది కలిగించే అంశమే. విండీస్ తరపున 48 టెస్ట్ లు ఆడిన అనుభవం రోచ్ కు ఉంది. ఇందులో అతడు 143 వికెట్లు పడగొట్టాడు.

click me!