ధోని పనైపోయింది... అతడిపై అంచనాలు తగ్గించుకోవాలి : సంజయ్ మంజ్రేకర్

By Arun Kumar PFirst Published Oct 2, 2018, 3:02 PM IST
Highlights

ఎంఎస్ ధోని... క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. అద్భుతమైన ధనా ధన్ బ్యాటింగ్ తోనే కాదు...కెప్టెన్ గా టీంఇండియా ఆటగాళ్లను ముందుండి నడిపించి ఎన్నో విజయాలను అందించాడు. అయితే ప్రస్తుతం అతడు టెస్ట్ క్రికెట్ కు రిటైర్ మెంట్ ప్రకటించి కేవలం వన్డేలు, టీ20లకే పరిమితమయ్యాడు. అయితే ధోని ఆటతీరులో మార్పు వచ్చిందని..మునుపటిలా అతడు దాటిగా బ్యాటింగ్ చేయలేకపోతున్నాడంటూ మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బ్యాట్ మెన్ గా ధోనీ ప్రపంచస్థాయి ఆటతీరును కనబర్చడం లేదంటూ మంజ్రేకర్ పేర్కొన్నారు.

ధోనీ ఒకప్పుడు తన ధనాధన్ బ్యాటింగ్ తో మ్యాచ్ విన్నర్ గా నిలిచాడని...కానీ ఇప్పుడు అతడిలో మ్యాచ్ ఫినిషర్ కనిపించడం లేదన్నారు. అయితే వికెట్ కీఫర్ గా మాత్రం ఇంకా అద్భుతాలు చేస్తున్నాడని...వేగంగా కదులుతూ స్టంపింగ్ చేయడంతో ధోని కి సాటి ఎవరు లేరన్నారు. కానీ టీం విజయానికి ఇదొక్కటే పనిచేయదని పేర్కొన్న మంజ్రేకర్ ప్రపంచకప్ తర్వాత అతడికి ప్రత్యామ్నాయ ప్లేయర్ కోసం వెతకాల్సిన అవసరం ఉందన్నారు.

కెప్టెన్ గా ధోనీకి వున్న అనుభవం ప్రస్తుతం విరాట్ కు అవసరమని మంజ్రేకర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాబట్టి వరల్డ్ కప్ వరకు ధోనీని కొనసాగించి ఆ తర్వాత అతడి స్థానంలో మరో ఆటగాడికి అవకాశం కల్పించాలని మంజ్రేకర్ సూచించారు.

ఇంగ్లాండుపై టెస్టు సిరీస్ ను 1-4 తేడాతో కోల్పోవడానికి భారత బ్యాట్స్ మెన్ చెత్త బ్యాటింగ్ కారణమని భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ విమర్శించారు. భారత బౌలర్లను ఆయన ప్రశంసించారు. ఇండియా పోరాటం చేయడానికి తగిన ప్రతిభను బౌలర్లను కనబరిచారని, బ్యాట్స్ మెన్ పూర్తిగా విఫలమయ్యారని ఆయన అన్నారు. బౌలర్లు అవకాశం కల్పించినప్పటికీ దాన్ని బ్యాట్స్ మెన్ వాడుకోలేకపోయారని  మంజ్రేకర్ అన్నాడు. 

సంబంధిత వార్తలు
చెత్త బ్యాటింగ్ వల్లే ఇంగ్లాండుపై ఓటమి: సంజయ్ మంజ్రేకర్

click me!