చెత్త బ్యాటింగ్ వల్లే ఇంగ్లాండుపై ఓటమి: సంజయ్ మంజ్రేకర్

Published : Oct 02, 2018, 12:22 PM IST
చెత్త బ్యాటింగ్ వల్లే ఇంగ్లాండుపై ఓటమి: సంజయ్ మంజ్రేకర్

సారాంశం

ఇండియా పోరాటం చేయడానికి తగిన ప్రతిభను బౌలర్లను కనబరిచారని, బ్యాట్స్ మెన్ పూర్తిగా విఫలమయ్యారని ఆయన అన్నారు. బౌలర్లు అవకాశం కల్పించినప్పటికీ దాన్ని బ్యాట్స్ మెన్ వాడుకోలేకపోయారని  మంజ్రేకర్ అన్నాడు. 

న్యూఢిల్లీ: ఇంగ్లాండుపై టెస్టు సిరీస్ ను 1-4 తేడాతో కోల్పోవడానికి భారత బ్యాట్స్ మెన్ చెత్త బ్యాటింగ్ కారణమని, భారత క్రీడాకారుల బ్యాటింగ్ టెక్నిక్ బాగా లేదని భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ విమర్శించారు. భారత బౌలర్లను ఆయన ప్రశంసించారు. 

ఇండియా పోరాటం చేయడానికి తగిన ప్రతిభను బౌలర్లను కనబరిచారని, బ్యాట్స్ మెన్ పూర్తిగా విఫలమయ్యారని ఆయన అన్నారు. బౌలర్లు అవకాశం కల్పించినప్పటికీ దాన్ని బ్యాట్స్ మెన్ వాడుకోలేకపోయారని  మంజ్రేకర్ అన్నాడు. 

దక్షిణాఫ్రికాలోనూ ఇంగ్లాండులోనూ భారత బ్యాట్స్ మెన్ టెక్నిక్ సమస్య, ప్రత్యేక ఆత్మరక్షణ ధోరణి దెబ్బ తీసిందని అన్నారు. డే - నైట్ టెస్టు సిరీస్ లను ఏర్పాటు చేయాలని, దాని వల్ల ప్రేక్షకులు పెరుగుతారని ఆయన అన్నారు. 

డే - నైట్ టెస్టు మ్యాచుల వల్ల ప్రేక్షకులు పెరుగుతారని, ఆదరణ పెరుగుతుందని, దానివల్ల నాణ్యత పెరుగుతుందని ఆయన అన్నారు. దీనిపై బిసిసిఐ ఎందుకు వ్యతిరేకంగా ఉందో అర్థం కావడం లేదని అన్నారు. 

PREV
click me!

Recommended Stories

IND vs SA : కోహ్లీ, రోహిత్‌లకు క్రెడిట్ ఇవ్వని గంభీర్‌.. ఇదెక్కడి రచ్చ సామీ !
Yuvraj Singh: 6 బంతుల్లో 6 సిక్సర్లే కాదు.. యువరాజ్ సింగ్ రికార్డులు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే !