కోహ్లీకి ఎందుకు విశ్రాంతి ఇచ్చామంటే...: రవి శాస్త్రి

By pratap reddyFirst Published Oct 2, 2018, 11:55 AM IST
Highlights

సియా కప్ టోర్నీ సందర్భంగా కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇవ్వడానికి గల కారణాన్ని భారత క్రికెట్ జట్టు కోచ్ రవిశాస్త్రి వివరించారు.

ముంబై: ఆసియా కప్ టోర్నీ సందర్భంగా కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇవ్వడానికి గల కారణాన్ని భారత క్రికెట్ జట్టు కోచ్ రవిశాస్త్రి వివరించారు. కోహ్లీకి ఈ విశ్రాంతి అవసరమని, అతను ఆడడం మొదలు పెడితే ఎలా ఆడుతాడో అందరికీ తెలుసునని ఆయన అన్నారు.

మానసికపరమైన అంశం మీదనే కోహ్లీకి విశ్రాంతి ఇచ్చామని, క్రికెట్ నుంచి పూర్తిగా మనసును దూరం చేసుకుని తిరిగి తాజాగా రావాలనే ఉద్దేశంతోనే విశ్రాంతి ఇచ్చామని ఆయన అన్నారు. 

ఇతర క్రికెటర్ల విషయంలో కూడా అదే పద్ధతిని అనుసరిస్తున్నామని ఆయన చెప్పారు. బుమ్రా, భువనేశ్వర్ కుమార్ వంటి వారికి కూడా విశ్రాంతి ఇచ్చామని, వారు నిలకడగా రాణిస్తూ శక్తివంతంగా ఉండాలనే ఉద్దేశంతోనే విశ్రాంతి ఇస్తున్నామని అన్నారు. 

త్వరలో వెస్టిండీస్ తో జరిగే రెండు టెస్టుల సిరీస్ కు కోహ్లీ నాయకత్వం వహిస్తున్నాడు. 

click me!