వన్డేల్లో 21ఏళ్లు....కానీ టీ20 లో నాలుగేళ్లే...విండీస్‌పై భారత్‌ రికార్డు

By Arun Kumar PFirst Published Nov 5, 2018, 3:15 PM IST
Highlights

భారత్-వెస్టిండిస్‌ల మధ్య స్వదేశంలో జరుగుతున్న సీరిస్ లో భారత ఆటగాళ్లు అదరగొడుతున్నారు. మొదట టెస్ట్ సీరీస్ ను ఆ తర్వాత వన్డే సీరిస్ను గెలుచుకున్న భాతత్ ఇప్పుడు టీ20 సీరిస్ పై కన్నేసింది. ఇందులోభాగంగా కోల్కతాలో జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో విండీస్ పై భారత్ ఘన విజయం సాధించింది. ఇలా 3 మ్యాచ్ సీరిస్ లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. 
 
ఇటీవలే విండీస్ తో జరిగిన చివరి వన్డేలో భారత బౌలర్లు చెలరేగడంతో విండీస్ కేవలం 104 పరుగులకే ఆలౌటయిన విషయం తెలిసిందే. ఇలా విండీస్ ను అత్యల్ప స్కోరుకే ఆలౌట్ చేసిన భారత్ 21 ఏళ్ల రికార్డును బద్దలుగొట్టింది. 1997లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో జరిగిన వన్డే మ్యాచ్ లో భారత్ బౌలర్లు కేవలం 121 పరుగులకే విండీస్ ను కుప్పకూల్చారు. ఆ తర్వాత అంత తక్కువ స్కోరు మళ్లీ భారత్-విండీస్ ల మధ్య జరిగిన  మ్యాచుల్లో ఎప్పుడు నమోదు కాలేదు. తాజాగా చివరి వన్డేలో అంతకంటే తక్కువ పరుగులు (104) సాధించిన విండీస్ తన చెత్త రికార్డును తానే బద్దలుగొట్టుకుంది. 

అలాగే ఆ  తర్వాత ప్రారంభమైన టీ20 సీరిస్ లో కూడా విండీస్ ఖాతాలో అలాంటి చెత్త రికార్డే చేరింది. ఈ మ్యాచ్ లో నిర్ణీత ఓవర్లలో కేవలం 109 పరుగులకే విండీస్ జట్టును భారత బౌలర్లు పరిమితం చేశారు. 2014 తర్వాత జరిగిన టీ20 మ్యాచుల్లో భారత్‌పై విండీస్‌కిదే  అత్యల్ప స్కోరు. అప్పుడు 129 పరుగులకే పరిమితమైన విండీస్ తాజాగా 109 పరుగులే సాధించి తన చెత్త రికార్డును తానే బద్దలుగొట్టుకుంది. 

విండీస్ నిర్దేశించిన 110 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 17.4 ఓవర్లలోనే ఐదు కోల్పోయి సాధించింది. దీంతో భారత్ తన ఖాతాలో రికార్డు విజయాన్ని వేసుకుంది. వరుసగా  మ్యాచుల్లో(చివరి వన్డే, మొదటి టీ20) భారత బౌలర్లు భారత్ కు మెరుగైన రికార్డు...విండీస్ బ్యాట్ మెన్స్ చెత్త రికార్డును నమోదు చేశారు. 

మరిన్ని వార్తలు

టీ 20: భయపెట్టిన విండీస్ బౌలర్లు, కష్టపడి గెలిచిన ఇండియా

click me!