అడిగి మరీ తీసుకున్నాడు: కృనాల్ పాండ్యపై రోహిత్ శర్మ

By pratap reddyFirst Published Nov 5, 2018, 12:41 PM IST
Highlights

వెస్టిండీస్ తమ ముందు ఉంచిన 110 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కృనాల్ 9 బంతుల్లో 21 పరుగులు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండా, కీలకమైన పోలార్డ్ వికెట్ కూడా తీశాడు.

కోల్‌కతా: కృనాల్ పాండేకు సంబంధించిన ఆ ఆసక్తికరమైన విషయాన్ని ట్వంటీ20 భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. వెస్టిండీస్ తమ ముందు ఉంచిన 110 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కృనాల్ 9 బంతుల్లో 21 పరుగులు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండా, కీలకమైన పోలార్డ్ వికెట్ కూడా తీశాడు.

భారత్‌ బౌలింగ్‌ చేసేటప్పుడు కృనాల్‌ అడిగి మరీ బౌలింగ్‌ తీసుకున్న విషయాన్ని మ్యాచ్‌ తర్వాత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వెల్లడించాడు. విండీస్‌ కీలక ఆటగాడు పొలార్డ్‌ క్రీజ్‌లో ఉన్న సమయంలో తాను బౌలింగ్‌ చేస్తానని కృనాల్‌ అడిగాడని, ఆ వికెట్‌ కోసం కృనాల్‌ పట్టుబట్టీ మరీ బౌలింగ్‌ చేశాడని అన్నాడు. 

అలా అడిగి బౌలింగ్‌ చేయడమే కాదు, పొలార్డ్‌ వికెట్‌ను కూడా పడగొట్టాడని చెప్పాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌ తరఫున ఆడే పొలార్డ్‌ను కృనాల్‌ దగ్గర్నుంచి గమనించడం కూడా బౌలింగ్‌ చేస్తానని అడగటానికి ఒక కారణమని అన్నాడు. 

ఒక జట్టు ఏమైతే ఆశిస్తుందో అదే కృనాల్‌ చేసి చూపెట్టాడని, ఇలా ప్రతీ క్రికెటర్‌ తమ తమ సవాళ్లను సమర్ధవంతంగా నిర్వర్తించేటప్పుడు కెప్టెన్‌కు కావాల్సింది ఏముంటుందని అన్నాడు.

వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ నిర్దేశించిన 110 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 17.5 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. 

click me!