ఆ షాట్లకు నేను ఫ్యాన్ ని: కోహ్లీపై సచిన్ ప్రశంసల జల్లు

Published : Nov 05, 2018, 12:52 PM IST
ఆ షాట్లకు నేను ఫ్యాన్ ని: కోహ్లీపై సచిన్ ప్రశంసల జల్లు

సారాంశం

ప్రధానంగా కోహ్లి కొట్టే కవర్‌ డ్రైవ్స్‌కు తాను పెద్ద అభిమానిని అని సచిన్‌ తెలిపాడు. తాను పోలికలను ఏ మాత్రం ఇష్టపడనని సచిన్ అన్నాడు. ఇప్పటివరకూ కోహ్లి సాధించిన ఘనతలు అసాధారణమని మెచ్చుకున్నాడు.

ముంబై: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసల జల్లు కురిపించాడు.కోహ్లి ఆటను తాను ఎంతగానో ఇష్టపడతానని ఆయన అన్నాడు. ప్రధానంగా కోహ్లి కొట్టే కవర్‌ డ్రైవ్స్‌కు తాను పెద్ద అభిమానిని అని సచిన్‌ తెలిపాడు. 

తాను పోలికలను ఏ మాత్రం ఇష్టపడనని సచిన్ అన్నాడు. ఇప్పటివరకూ కోహ్లి సాధించిన ఘనతలు అసాధారణమని మెచ్చుకున్నాడు. ఒక్కో క్రికెటర్‌ ఏదొక షాట్‌తో ప‍్రత్యేకతను తెచ్చుకుంటాడని, ఇక్కడ విరాట్‌ కోహ్లి వరకూ వస్తే అతను కొట్టే కవర్‌ డ్రైవ్స్‌ చాలా అందంగా ఉంటాయని అన్నాడు. 

 కోహ్లిని ఎవరితోనూ పోల్చలేమని అన్నాడు. ఆస్ట్రేలియా పర్యటన భారత్‌కు చాలా ముఖ్యమైనదిగా సచిన్‌ అభిప్రాయపడ్డాడు. ప్రధానంగా ఆసీస్‌ పర్యటన కోహ్లికి పెద్ద సవాల్‌ అని చెప్పాడు. ఆసీస్‌ ఎప్పటికీ కఠినమైన ప‍్రత్యర్థియేనని, వారి బ్యాటింగ్‌ లోతును అంచనా వేయడం కష్టమని అన్నాడు. 

అందువల్ల ఆసీస్‌తో భారత్‌కు గట్టి పోటీ ఉంటుందని అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా విజయవంతమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పాడు. ప‍్రస్తుత భారత జట్టు సమతూకంగా ఉందని అన్నాడు.

PREV
click me!

Recommended Stories

ఇదేం లాజిక్ సామీ.. గంభీర్ దత్తపుత్రుడి కోసం ఇద్దరి కెరీర్ బలి.. ఆ ప్లేయర్స్ ఎవరంటే.?
ఒరేయ్ బుడ్డోడా.. సచిన్‌ను గుర్తు చేశావ్.! 14 సిక్సర్లతో మోత మోగించిన వైభవ్.. ఏం కొట్టుడు మావ