ఆడటం వచ్చా..టీమిండియా చెత్త బ్యాటింగ్‌పై గావస్కర్ ఫైర్

By sivanagaprasad kodatiFirst Published Dec 6, 2018, 4:11 PM IST
Highlights

బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా మొదటి ఇన్నింగ్సులో భాగంగా ఆస్ట్రేలియాతో అడిలైడ్‌లో జరిగిన తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్సులో టీమిండియా ఆట తీరుపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ మండిపడ్డారు. 

బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా మొదటి ఇన్నింగ్సులో భాగంగా ఆస్ట్రేలియాతో అడిలైడ్‌లో జరిగిన తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్సులో టీమిండియా ఆట తీరుపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ మండిపడ్డారు. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అంతా అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతుల్ని వెంటాడీ మరీ వికెట్‌ సమర్పించుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు.

వదిలేయాల్సిన బంతులపైకి వెళ్లి మరీ వికెట్లు చేజార్చుకోవడమేంటీ..కోకోబుర్రా బంతులు కేవలం కొన్ని ఓవర్లు మాత్రమే స్వింగ్ కావడానికి సహకరిస్తాయి. అటువంటప్పుడు దానిని ఉపయోగించుకోవడం మానేసి ఇంత పెలవంగా ఔటవుతారా..? ప్రతీ ఒక్కరు మొదటి సెషన్‌లోనే పోటీ పడి మరీ వికెట్లు కోల్పోయారంటూ సన్నీ కామెంట్ చేశారు.

టీమిండియా సిరీస్‌ను ఇలా ఆరంభించడం నిజంగా బాధాకరమన్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్లు కోల్పోయి 250 పరుగులు చేసింది. అందరూ పెవిలియన్ చేరుతున్నా.. చతేశ్వర పుజారా సెంచరీ చేసి జట్టును గౌరవప్రదమైన స్కోరు వద్ద నిలిపాడు. 

ఆస్ట్రేలియాతో తొలి టెస్టు.. పుజారా ఖాతాలో రెండు అరుదైన రికార్డులు

అడిలైడ్ టెస్ట్: పుజారా ఒంటరి పోరు, తొలి రోజు భారత్ 250/9

వికెట్ పారేసుకున్న రోహిత్... మాజీలు, అభిమానుల ఆగ్రహం

click me!