ఆసియాకప్‌లో ఫిక్సింగ్..ఆఫ్గాన్ క్రికెటర్‌ను కలిసిన బుకీలు

By sivanagaprasad kodatiFirst Published Sep 25, 2018, 2:15 PM IST
Highlights

ఫిక్సింగ్ భూతం మరోసారి పడగవిప్పింది. యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్‌లో స్పాట్ ఫిక్సింగ్ కలకలం రేపింది. కొందరు బుకీలు తనను కలిసినట్లుగా ఆఫ్గానిస్తాన్ వికెట్ కీపర్ మొహ్మద్ షహ్‌జాద్ జట్టు మేనేజ్‌మెంట్‌కు తెలిపాడు.

దీంతో ఆఫ్గాన్ మేనేజ్‌మెంట్ అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి (ఐసీసీ) అవినీతి నిరోధక విభాగం రంగంలోకి దిగింది. షహజాద్‌ను కలిసిన బుకీలు.. త్వరలో జరగనున్న టీ20 లీగ్‌లో ఫిక్సింగ్ చేయాలంటూ ప్రేరేపించారు.

ఈ విషయంపై దర్యాప్తు చేపట్టిన.. ఐసీసీ యాంటీ కరెప్షన్ యూనిట్ గత ఏడాదిగా ఐదుగురు అంతర్జాతీయ స్థాయి కెప్టెన్లను బుకీలు కలిశారని.. ఇందులో ఐసీసీ సభ్యత్వం ఉన్న నాలుగు దేశాలకు చెందిన కెప్టెన్లు ఉన్నారని అవినీతి నిరోధక విభాగం తెలిపింది.

ఈ వ్యవహారంలో మొత్తం 32 మంది క్రికెటర్లను విచారించినట్లుగా ఐసీసీ తెలిపింది. ఫిక్సింగ్ నేపథ్యంలో ఆసియా కప్‌‌లోని మిగిలిన మ్యాచ్‌ల్లో ఆటగాళ్ల కదిలికలపై ఐసీసీ నిఘా పెట్టింది.

click me!