ఆసియా కప్‌ ఎఫెక్ట్.. కెప్టెన్సీ నుంచి మాథ్యూస్ ఔట్.. ‘‘నన్ను బలి చేశారు’’

By sivanagaprasad kodatiFirst Published Sep 24, 2018, 6:25 PM IST
Highlights

ఆసియా కప్‌లో తిరుగులేని ట్రాక్ రికార్డు ఉన్న శ్రీలంక ఈ ఏడాది మాత్రం నిరాశపరిచింది. భారత్, పాకిస్తాన్ వంటి మేటిజట్లను మట్టికరిపించి.. ఎన్నోసార్లు ఆసియా కప్ అందుకున్న లంక ఈ ఏడాది పసికూనలైన బంగ్లాదేశ్, ఆఫ్గనిస్థాన్ చేతిలో ఘోర పరాజయం పాలైంది

ఆసియా కప్‌లో తిరుగులేని ట్రాక్ రికార్డు ఉన్న శ్రీలంక ఈ ఏడాది మాత్రం నిరాశపరిచింది. భారత్, పాకిస్తాన్ వంటి మేటిజట్లను మట్టికరిపించి.. ఎన్నోసార్లు ఆసియా కప్ అందుకున్న లంక ఈ ఏడాది పసికూనలైన బంగ్లాదేశ్, ఆఫ్గనిస్థాన్ చేతిలో ఘోర పరాజయం పాలైంది.

దీంతో లంక అభిమానులు, మాజీ క్రికెటర్ల నుంచి విమర్శలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా కెప్టెన్ మాథ్యూస్‌పై అన్ని వైపుల నుంచి ఒత్తిడి రావడంతో.. అతనిపై లంక క్రికెట్ బోర్డు వేటు వేసింది.. కెప్టెన్సీ నుంచి తొలగించి.. అతనికి బదులుగా మూడు ఫార్మాట్లకు దినేశ్ చండీమాల్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది.

అక్టోబర్ 10 నుంచి ఇంగ్లాండ్‌తో జరిగే వన్డే సిరీస్ నుంచి చండీమాల్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరిస్తాడని లంక బోర్డు తెలిపింది. తనను కెప్టెన్సీ తప్పించడంపై మాథ్యూస్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. జట్టు పేలవ ప్రదర్శన చేసిందని.. అందుకు తనపై నిందలు వేసి బలిపశువును చేశారని వాపోయాడు. 

click me!