భారత్-పాక్ మ్యాచ్: ధోనీ అడుగుజాడల్లో రోహిత్

By sivanagaprasad kodatiFirst Published Sep 24, 2018, 2:50 PM IST
Highlights

టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత వికెట్ కీపర్ తాను వన్డే కెప్టెన్సీకి గుడ్ బై చెప్పినా కీలక సమయాల్లో.. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కొన్ని సూచనలు చేస్తూ ఉంటాడు... వాటిని ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఇతర సహచరులు పాటిస్తూ ఉంటారు.

తాజాగా ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో ధోనీ మరోసారి తన సమయస్ఫూర్తిని ప్రదర్శించాడు. పాక్ బ్యాటింగ్‌‌లో ఎనిమిదో ఓవర్ ఆఖరి బంతి ఓపెనర్ ఇమాముల్ హక్ ప్యాడ్లను తాకింది. దీంతో భారత ఆటగాళ్లు వికెట్ కోసం అప్పీల్ చేయగా... ఫీల్డ్ అంపైర్ నిరాకరించాడు.

దీంతో డీఆర్ఎస్‌కు వెళ్లాల్సిందిగా ధోనీ.. కెప్టెన్ రోహిత్ శర్మకు సైగ చేశాడు. ధోనీ సలహా ఇచ్చిన వెంటనే మరో మాట లేకుండా రోహిత్ రివ్యూ కోరడంతో.. బంతి మిడిల్ స్టంప్‌ మీద ఉన్నట్లుగా తేలడంతో ఇమాముల్ ఎల్బీగా అవుట్ అయ్యాడు. దీంతో అభిమానులు, మాజీ క్రికెటర్లు ధోనీని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.. డీఆర్ఎస్ అంటే ‘‘ధోనీ రివ్యూ సిస్టమ్ ’’ అంటూ తెగ ట్వీట్లు చేస్తున్నారు.

click me!