శార్దూల్ కు అచ్చిరాని ఆరంగేట్రం: గాయపడి వెనక్కి

By pratap reddyFirst Published Oct 12, 2018, 10:48 AM IST
Highlights

టాస్ గెలిచి వెస్టిండీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ ఫీల్డింగ్ కు దిగాల్సి వచ్చింది. బౌలింగుకు దిగిన శార్డూల్ ఠాకూర్ దాదాపు 14 బంతులు వేశాడో లేదో గాయపడ్డాడు.

హైదరాబాద్: శార్దూల్ ఠాకూర్ కు ఆరంగేట్రం అచ్చి రానట్లే ఉంది. హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో వెస్టిండీస్ పై జరుగుతున్న రెండో టెస్టు మ్యాచులో శార్దూల్ ఠాకూర్ టెస్ట్ క్రికెట్ లో ఆరంగేట్రం చేశాడు. అయితే, అంతలోనే గాయపడి మైదానం నుంచి వైదొలిగాడు. 

ఈ మ్యాచులో టాస్ గెలిచి వెస్టిండీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ ఫీల్డింగ్ కు దిగాల్సి వచ్చింది. బౌలింగుకు దిగిన శార్డూల్ ఠాకూర్ దాదాపు 14 బంతులు వేశాడో లేదో గాయపడ్డాడు.

అతని చీలమండ గాయం తిరగబెట్టింది. ఆ నొప్పితో విలవిలలాడుతుంటే చూడలేక కెప్టెన్ కోహ్లీ, ఫిజియో మైదానం వీడాల్సిందిగా సూచించారు. దాంతో అతను మైదానం వీడాడు.

శూర్దూల్ 3.4 ఓవర్లు ఓవర్లు వేశాడు. చివరి రెండు బంతులు అశ్విన్ వేసి ఓవర్ పూర్తి చేశాడు. 

click me!