కోహ్లీ మాట: ఓడినా మజా వచ్చిందట

By pratap reddyFirst Published Sep 12, 2018, 11:05 AM IST
Highlights

ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌ ఓడిపోయినప్పటికీ టెస్ట్‌ క్రికెట్‌ మజా లభించిందని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అన్నాడు. చివరి టెస్ట్‌లో విజయంపై ఆశలు రేపినప్పటికీ భారత్‌కు 118 పరుగుల పరాజయం తప్పలేదు.

లండన్‌ : ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌ ఓడిపోయినప్పటికీ టెస్ట్‌ క్రికెట్‌ మజా లభించిందని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అన్నాడు. చివరి టెస్ట్‌లో విజయంపై ఆశలు రేపినప్పటికీ భారత్‌కు 118 పరుగుల పరాజయం తప్పలేదు. దీంతో 5 టెస్ట్‌ల సిరీస్‌ ఇంగ్లండ్‌ 4-1తో కైవసం చేసుకుంది. 

ఇంగ్లండ్‌ తమ కంటే మెరుగ్గా అడిందని, లార్డ్స్‌ టెస్ట్‌ మినహా మేం మిగతా మ్యాచ్‌లు బాగానే ఆడామని, తమకు లభించిన అవకాశాలను వినియోగించుకోలేకపోయామని మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మీడియాతో అన్నాడు. తాము ఓడిపోయినప్పటికీ ఈ సిరీస్‌ హోరాహోరిగా సాగిందని, అసలైన టెస్ట్‌ క్రికెట్‌ మజాను ఈ సిరీస్‌ అందించిందని అన్నాడు. 

రాహుల్‌, పంత్‌ల బ్యాటింగ్‌ అద్భుతమని, పంత్‌ పోరాటపటిమ ఆకట్టుకుందని, అతనిపై తమకు విశ్వాసం ఉందని కోహ్లీ అన్నాడు. ఈ ఇద్దరు ఆటగాళ్లు భారత్‌ భవిష్యత్తు అని అన్నాడు. సామ్‌ కరణ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌కు అర్హుడని కూడా అన్నాడు. తొలి, నాలుగో టెస్ట్‌లో అతను ఇంగ్లండ్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడని, కష్ట సమయాల్లో తన జట్టును ఆదుకున్నాడని అన్నాడు. 

ఈ మ్యాచ్‌తో ఘనంగా అంతర్జాతీయ క్రికెట్‌ వీడ్కోలు పలికిన ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ అలిస్టర్‌ కుక్‌ గురించి కోహ్లి మాట్లాడాడు. అతని కెరీర్‌ గొప్పగా సాగిందని, అంతా మంచే జరగాలని కోరుకుంటున్నానని అన్నాడు.

ఒక్క సెంచరీతో రికార్డులన్నీ చెల్లా చెదురు... ధోనీని వెనక్కునెట్టిన పంత్

ఇంగ్లాండ్‌తో ఓటమి.. 10 పాయింట్లు కోల్పోయిన భారత్.. అయినా నెంబర్‌వన్ మనమే

భారత్‌కు దారుణ పరాజయాన్ని తప్పించిన రాహుల్-రిషబ్

click me!