భారత్‌కు దారుణ పరాజయాన్ని తప్పించిన రాహుల్-రిషబ్

By sivanagaprasad KodatiFirst Published Sep 12, 2018, 7:38 AM IST
Highlights

ఇంగ్లాండ్‌తో జరిగిన 5వ టెస్టులో భారత్ పోరాడి ఓడింది.. 464 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి.

ఇంగ్లాండ్‌తో జరిగిన 5వ టెస్టులో భారత్ పోరాడి ఓడింది.. 464 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. 58 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా.. 121 పరుగలకే సగం వికెట్లు కోల్పోయి ఇంగ్లాండ్‌కు భారీ పరుగుల తేడాతో విజయాన్ని ఇచ్చేలా కనిపించింది.

అయితే భారత్‌కు ఆ ఘోర పరాభవాన్ని తప్పించింది కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ జోడీ. వీరిద్దరూ నువ్వా నేనా అన్నట్లు ఆడటంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ముఖ్యంగా రిషబ్ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో రాహుల్, పంత్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు.

ఈ జోడీ విజృంభించడంతో భాతర శిబిరంలో ఆశలు రేగాయి. అయితే ఇంగ్లాండ్ స్పిన్నర్ రషీద్ అద్భుతమైన బంతితో రాహుల్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఆ వెంటనే పంత్‌ను పెవిలియన్ పంపి ఇంగ్లాండ్‌కు ఊపిరి పోశాడు. ఈ జంట విడిపోయిన మరుక్షణం నుంచి భారత్ ఓటమికి చేరువై.. సిరీస్ 4-1 తేడాతో ఇంగ్లాండ్ వశమైంది. 

ఒక్క సెంచరీతో రికార్డులన్నీ చెల్లా చెదురు... ధోనీని వెనక్కునెట్టిన పంత్

ఇంగ్లాండ్‌తో ఓటమి.. 10 పాయింట్లు కోల్పోయిన భారత్.. అయినా నెంబర్‌వన్ మనమే

కోహ్లీ మాట: ఓడినా మజా వచ్చిందట

 

click me!