ద్రావిడ్ ఫోన్ కాల్ వల్లే...: విహారీ

First Published 10, Sep 2018, 9:48 PM IST
Highlights

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ కు తాను చేసిన ఫోన్ కాల్ వల్లనే తాను తన తొలి టెస్టు మ్యాచులో రాణించినట్లు తెలుగు క్రికెటర్ హనమ విహారీ చెప్పాడు. రాహుల్ ద్రావిడ్ ఇచ్చిన సలహాలతోనే తన తొలి టెస్టు మ్యాచ్‌లో రాణించినట్టు తెలిపాడు. 

లండన్: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ కు తాను చేసిన ఫోన్ కాల్ వల్లనే తాను తన తొలి టెస్టు మ్యాచులో రాణించినట్లు తెలుగు క్రికెటర్ హనమ విహారీ చెప్పాడు. రాహుల్ ద్రావిడ్ ఇచ్చిన సలహాలతోనే తన తొలి టెస్టు మ్యాచ్‌లో రాణించినట్టు తెలిపాడు. 

జట్టులో చేరాలంటూ తనకు పిలుపు వచ్చిన వెంటనే భారత జూనియర్ జట్టు కోచ్ రాహుల్ ద్రావిడ్‌కు ఫోన్ చేసి విషయం చెప్పానని తెలిపాడు. జాగ్రత్తగా ఆడాలని ద్రావిడ్ ప్రోత్సహించాడని, సానుకూల దృక్పథంతో బరిలోకి దిగాలని సూచించాడని తెలిపాడు. 


ఆయనో గొప్ప ఆటగాడని, ఆయన ఇచ్చే సలహాలు ఎంతగానో ఉపయోగపడ్డాయని విహారీ ప్రశంసించాడు. తొలి టెస్టులోనే అర్ధ సెంచరీ సాధించి భేష్ అనిపించుకున్నాడు. హార్దిక్ పాండ్యా స్థానంలో జట్టులోకి వచ్చాడు.

విహారి అర్థసెంచరీ.. తొలి టెస్టులోనే హాఫ్ సెంచరీ చేసిన ఆంధ్రా కుర్రాడు
 
తొలి ఇన్నింగ్స్‌లోనే 56 పరుగులు చేసిన హనుమ రవీంద్ర జడేజాతో కలిసి 77 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. తద్వారా జట్టు గౌరవ ప్రదమైన స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించాడు.

 తాను క్రీజులోకి వచ్చినప్పుడు మరో ఎండ్‌లో కోహ్లీ ఉన్నాడని, అతడు తనకు ఎన్నో విలువైన సలహాలు ఇచ్చాడని విహారి తెలిపాడు. ఈ కారణంగానే ఎటువంటి ఒత్తిడి లేకుండా ఆడగలిగానని చెప్పాడు.

Last Updated 19, Sep 2018, 9:22 AM IST