అరంగేట్ర మ్యాచ్ లోనే ఓ అరుదైన, ఓ చెత్త రికార్డు సాధించిన రిషబ్ పంత్

By Arun Kumar PFirst Published Sep 1, 2018, 2:59 PM IST
Highlights

ఐదు టెస్ట్ ల సీరీస్ లో భాగంగా ఆతిథ్య ఇంగ్లాండ్ తో జరిగిన మూడో టెస్ట్ లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ ద్వారా రిషబ్ పంత్ టెస్ట్ క్రికెట్ లో ఆరంగేట్ర చేశాడు. అయితే ఈ మ్యాచ్ లో వికెట్ కీపర్ గా మంచి ఆటతీరును కనబర్చిన రిషబ్ భారత జట్టు గెలుపులో తన వంతు పాత్ర పోషించాడు. ఇలా వికెట్ కీపర్ గా అరుదైన రికార్డు సాధించాడు. కానీ బ్యాట్ మెన్ గా అంతే చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలా ఒకే మ్యాచ్ లో రెండు రకాల అనుభవాలను పొందాడు రిషబ్.  
 
రిషబ్ పంత్ మూడో టెస్ట్ లో వికెట్ కీపర్ గా ఒకే ఇన్నింగ్స్ లో ఐదు క్యాచ్ లు పట్టి ఇంగ్లాండ్ బ్యాట్ మెన్స్ ని పెవిలియన్ కు పంపించాడు. ఇలా ఆడిన మొదటి మ్యాచ్ లోనే ఐదు క్యాచ్‌లు పట్టిన నాల్గో భారత వికెట్‌ కీపర్‌గా పంత్ ఘనత సాధించాడు. అలాగే ఒకే ఇన్నింగ్స్ లో ఐదు క్యాచ్ పట్టిన మొదటి ఆరంగేట్ర వికెట్ కీపర్ గా రికార్డు నెలకొల్పాడు.

అయితే వికెట్ కీపర్ అదరగొట్టినా బ్యాట్ మెన్ గా మాత్రం రిషబ్ ఆకట్టుకోలేకపోయాడు. దీంతో అతడి ఖాతాలోకి ఓ చెత్త రికార్డు చేరింది. 29 బంతుల్ని ఎదుర్కొని ఒక్క రన్ కూడా సాధించకుండానే రిషబ్ డకౌటయ్యాడు. ఇలా 29 బంతుల్లో ఒక్క పరుగు కూడా సాధించని బ్యాట్స్ మెన్స్ జాబితాలో రిషబ్ చేరిపోయాడు. ఇప్పటివరకు ఈ చెత్త రికార్డు ఇర్ఫాన్ పఠాన్, సురేష్ రైనా ల పేరుతో ఉండగా వీరి సరసన రిషబ్ కూడా చేరిపోయాడు.
  
click me!