వణికించిన అలీ: నిలిచిన పుజారా, భారత్ స్కోర్ ఇదే....

By pratap reddyFirst Published Sep 1, 2018, 7:40 AM IST
Highlights

నాలుగో టెస్టు మ్యాచులో భారత్ బ్యాట్స్ మెన్ ను ఇంగ్లాండు స్పిన్నర్ మొయిన్ అలీ వణికించాడు. అతని ధాటికి సగం మంది బ్యాట్స్ మెన్ పెవిలియన్ కు చేరుకున్నారు. ఛతేశ్వర్ పుజారా ఒక్కడే నిలిచి భారత్ ను ఆదుకున్నాడు.

సౌతాంప్టన్: నాలుగో టెస్టు మ్యాచులో భారత్ బ్యాట్స్ మెన్ ను ఇంగ్లాండు స్పిన్నర్ మొయిన్ అలీ వణికించాడు. అతని ధాటికి సగం మంది బ్యాట్స్ మెన్ పెవిలియన్ కు చేరుకున్నారు. ఛతేశ్వర్ పుజారా ఒక్కడే నిలిచి భారత్ ను ఆదుకున్నాడు.
 
చటేశ్వర్‌ పుజారా (257 బంతుల్లో 16 ఫోర్లతో 132 నాటౌట్‌) ఒంటరి పోరాటం చేసి సాధించిన సెంచరీతో భారత్‌ కోలుకుంది.  195 పరుగులకు 8 వికెట్లు పడిన దశలో టెయిలెండర్ల సహకారంతో జట్టుకు 27 పరుగుల ఆధిక్యాన్ని అందించాడు. దీంతో ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 84.5 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌట్‌ అ య్యింది. 

కెప్టెన్‌ కోహ్లీ (46) ఫరవాలేదనిపించాడు. అలీకి ఐదు, బ్రాడ్‌కు 3వికెట్లు దక్కాయి. ఆతర్వాత ఇంగ్లండ్‌ శుక్రవారం రెండోరోజు ఆట ముగిసేసరికి రెండో ఇన్నింగ్స్‌లో4 ఓవర్లలో 6 పరుగులు చే సింది. క్రీజులో కుక్‌ (2 బ్యాటింగ్‌), జెన్నింగ్స్‌ (4 బ్యాటింగ్‌) ఉన్నారు.

రెండోరోజు తొలిసెషన్‌లో కో హ్లీ, పుజారా లంచ్‌ విరామానికి భారత్ స్కోరును 100/2 కి చేర్చారు. 19/0 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఆట ప్రారంభించిన భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు ధావన్‌ (23), రాహుల్‌ (19) నెమ్మదిగా ఆడే ప్రయత్నం చేశారు. 

అయితే కొద్ది వ్యవధిలోనే బ్రాడ్‌ వీరిద్దరినీ అవుట్ చేశాడు. భారత్‌ 50 పరుగులకు 2 వి కెట్లను కోల్పోయింది. ఈ దశలో కోహ్లీ, పుజారా రన్‌రేట్‌ను పెంచా రు. లంచ్ విరామ సమయానికి వికెట్ నష్టపోకుండా చూసుకున్నారు.
 
లంచ్ బ్రేక్‌ తర్వాత భారత్‌ తడబడింది. కోహ్లీ, రహానె (11)తో పాటు రిషభ్‌ వికెట్లను కోల్పోయింది. అర్ధ సెంచరీ వైపు వెళుతున్న కోహ్లీని కర్రాన్‌ దెబ్బతీశాడు. దీంతో మూడో వికెట్‌కు 92 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. మరో ఐదు ఓవర్ల తర్వాత స్టోక్స్‌ ఇన్‌స్వింగర్‌కు రహానె ఎల్బీ అయ్యాడు. 29 బంతులాడినా రిషబ్ ఒక్క పరుగు కూడా చేయకుండానే అలీ బౌలింగ్‌లో ఎల్బీ అయ్యాడు.
  
టీ విరామం తర్వాత స్పిన్నర్‌ మొయిన్‌ అలీ బంతులకు భారత బ్యాట్స్ మెన్ తల వంచుతూ వెళ్లారు. పుజారాకు అండగా నిలవలేక పాండ్యా (4), అశ్విన్‌ (1), షమి (0) ఆరు పరుగుల వ్యవధిలో అలీ బౌలింగ్‌లో పెవిలియన్ చేరుకున్నారు. 

ఈ దశలో పుజారా బౌండరీలతో వేగం పెంచాడు. 71వ ఓవర్‌లో ఇషాంత్‌ (14)ను కూడా అలీ అవుట్‌ చేయడంతో 96 పరుగుల వద్ద ఉన్న పుజారా శతకంపై ఉత్కంఠ చోటు చేసుకుంది. దీంతో తనే ఎక్కువ స్ట్రయిక్‌ తీసుకుని 210 బంతుల్లో 15వ శతకాన్ని పూర్తి చేశాడు. 

ఆ తర్వాత మరింత వేగం పెంచి బ్రాడ్‌ బౌలింగ్‌లో వరుస బౌండరీలతో చెలరేగాడు. ఆఖర్లో బుమ్రా అతడికి సహకరించడంతో పదో వికెట్‌కు 46 పరుగులు వచ్చాయి. బుమ్రా అవుట్ కావడంతో భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది.

click me!