ఆసియా కప్: కోహ్లీకి రెస్ట్, రోహిత్ కు పగ్గాలు, రాయుడు రీఎంట్రీ

By pratap reddyFirst Published Sep 1, 2018, 1:28 PM IST
Highlights

ఆసియా క్రికెట్ కప్ పోటీలకు బిసిసిఐ సెలెక్టర్లు భారత జట్టును ఎంపిక చేశారు. కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతి కల్పించారు. తీవ్రమైన ఒత్తిడి కారణంగా ఆయనకు విశ్రాంతి ఇవ్వాలని సెలెక్టర్లు భావించారు.

ముంబై: ఆసియా క్రికెట్ కప్ పోటీలకు బిసిసిఐ సెలెక్టర్లు భారత జట్టును ఎంపిక చేశారు. కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతి కల్పించారు. తీవ్రమైన ఒత్తిడి కారణంగా ఆయనకు విశ్రాంతి ఇవ్వాలని సెలెక్టర్లు భావించారు. రోహిత్ శర్మ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. 

అంబటి రాయుడు, భువనేశ్వర్ కుమార్, కేదార్ జాదవ్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చారు. సెప్టెంబర్ 15వ తేదీ నుంచి యుఈఎలో ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంటు జరగనుంది. 

ఆసియా కప్ పోటీలకు భారత జట్టు ఇదే...

రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్ (వైస్ కెప్టెన్), ఎంఎస్ ధోనీ, కెఎల్ రాహుల్, మనీష్ పాండే, దినేష్ కార్తిక్, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, చాహల్,  బుమ్రా, అంబటి రాయుడు, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, శార్దూల్ ఠాకూర్, ఖలీల్ అహ్మద్

 

Team India for Asia Cup, 2018 announced. Rohit Sharma set to lead the side in UAE pic.twitter.com/mx6mF27a9K

— BCCI (@BCCI)
click me!