బ్యాట్, బాల్‌తో దుమ్మురేపుతున్న ద్రావిడ్ కొడుకు.. క్రీజులో ఉంటే సెంచరీనే

Published : Jul 27, 2018, 01:55 PM IST
బ్యాట్, బాల్‌తో దుమ్మురేపుతున్న ద్రావిడ్ కొడుకు.. క్రీజులో ఉంటే సెంచరీనే

సారాంశం

ఒకప్పటి భారత స్టార్ క్రికెటర్లంతా మాజీలైపోవడంతో.. ఇప్పుడు వారి వారసులు బ్యాట్, బాల్ పట్టుకుని తండ్రుల పేరు నిలబెట్టేందుకు కృషి చేస్తున్నారు. వీరిలో ఇండియన్ క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్  కొడుకు అర్జున్ టెండూల్కర్ ముందువరుసలో ఉండగా... అతని తర్వాత మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్ కుమారుడు సమిత్ ద్రావిడ్ వార్తల్లో బాగా వినిపిస్తున్నాడు. 

ఒకప్పటి భారత స్టార్ క్రికెటర్లంతా మాజీలైపోవడంతో.. ఇప్పుడు వారి వారసులు బ్యాట్, బాల్ పట్టుకుని తండ్రుల పేరు నిలబెట్టేందుకు కృషి చేస్తున్నారు. వీరిలో ఇండియన్ క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్  కొడుకు అర్జున్ టెండూల్కర్ ముందువరుసలో ఉండగా... అతని తర్వాత మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్ కుమారుడు సమిత్ ద్రావిడ్ వార్తల్లో బాగా వినిపిస్తున్నాడు. వరుసగా పలు టోర్నీల్లో బ్యాట్ ఝలిపిస్తూ తన జట్టును గెలిపిస్తున్నాడు..

12 ఏళ్ల ఈ బుడ్డోడు ఇటీవల బెంగళూరులో ముగిసిన అండర్-14 స్థాయి టోర్నమెంట్‌లో మాల్యా అడితి ఇంటర్నేషనల్ స్కూల్ టీంలో ఆల్‌రౌండ్ ప్రతిభతో జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో 51 పరుగులు చేయడమే కాకుండా... బౌలర్‌గా తొమ్మిది పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.

గత జనవరిలో జరిగిన బీటీడబ్ల్యూ కప్ అండర్‌-14 టోర్నమెంట్‌లోనూ సెంచరీతో జట్టును విజయ తీరాలకు చేర్చాడు... 2015లో గోపాలన్ క్రికెట్ ఛాలెంజ్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేసి ‘‘బెస్ట్ బ్యాట్స్‌మెన్’’ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఈ కుర్రాడి ప్రతిభ చూస్తోన్న పలువురు మాజీలు సమిత్ ఇలాగే కృషి చేస్తే.. భవిష్యత్తులో టీమిండియా తరపున ఆడే అవకాశం ఉందని ప్రశంసిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Rohit Sharma: వైజాగ్ వన్డేలో రోహిత్ చరిత్ర.. 20 వేల పరుగుల క్లబ్‌లో మనోడి మాస్ ఎంట్రీ !
Abhishek Sharma : 100 సిక్సర్లతో దుమ్మురేపిన అభిషేక్ !