భారత్‌ను కొట్టడానికి టెస్టుల్లోకి రషీద్‌.. మనోళ్లు ఎదుర్కొంటారా..? చతికిలబడతారా..?

First Published Jul 27, 2018, 10:56 AM IST
Highlights

త్వరలో భారత్‌తో జరగనున్న ఐదు టెస్టుల  సిరీస్‌ను సొంతం చేసుకోవడానికి ఇంగ్లాండ్ వ్యూహాత్మంగా అడుగులు వేస్తోంది.  దీనిలో భాగంగా వన్డే సిరీస్‌లో భారత్‌ను ముప్పు తిప్పలు పెట్టిన స్పిన్నర్ ఆదిల్ రషీద్‌కు టెస్టుల్లో అవకాశం కల్పించారు. 

త్వరలో భారత్‌తో జరగనున్న ఐదు టెస్టుల  సిరీస్‌ను సొంతం చేసుకోవడానికి ఇంగ్లాండ్ వ్యూహాత్మంగా అడుగులు వేస్తోంది.  దీనిలో భాగంగా వన్డే సిరీస్‌లో భారత్‌ను ముప్పు తిప్పలు పెట్టిన స్పిన్నర్ ఆదిల్ రషీద్‌కు టెస్టుల్లో అవకాశం కల్పించారు. ప్రపంచంలోనే స్పిన్‌ను అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొంటారనే భారత బ్యాట్స్‌మెన్‌కు పేరు.. అలాంటిది ఆ స్పిన్‌ మాయాజాలానికే చిత్తయిపోయింది టీమిండియా.  

ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో ఘనవిజయం సాధించిన భారత్‌ను ఎదుర్కోవడానికి స్పిన్‌నే ఆయుధంగా చేసుకుంది ఇంగ్లీష్ జట్టు. రెండో వన్డేలో విజృంభించిన ఇంగ్లాండ్ స్పిన్నర్ రషీద్...  భారత్‌ను ముప్పు తిప్పలు పెట్టాడు. ఇప్పుడు అదే రషీద్‌ ద్వారా టీమిండియాను ఒత్తిడికి గురిచేసి గెలవాలన్నది ఇంగ్లాండ్  గేమ్ ప్లాన్. రషీద్ టెస్టు మ్యాచ్ ఆడి దాదాపు రెండేళ్లు అవుతోంది.. ఇప్పటి వరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 42.78 సగటుతో 38 వికెట్లు పడగొట్టాడు.

ఇతని బౌలింగ్‌ను అందరూ బ్యాట్స్‌మెన్ చితక్కొట్టారు.. దీంతో తనను టెస్టులకి ఎంపిక చేయవద్దు అన్నట్లు వన్డేలు, టీ20లకే పరిమితమయ్యాడు. అలాంటి రషీద్ రేపు భారత్‌ను ఏ విధంగా ఇబ్బంది పెడతాడో చూడాలి.. పైగా టీమిండియా బ్యాట్స్‌మెన్ కూడా రషీద్ బౌలింగ్‌పై అవగాహనకు వచ్చి వుండటంతో అతని బౌలింగ్ ఎంత మేర ప్రభావం చూపుతుందో వేచి చూడాలి..
 

click me!