De Kock: దక్షిణాఫ్రికా వికెట్ కీపర్, బ్యాటర్ క్వింటన్ డికాక్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్ట్ క్రికెట్ నుంచి తప్పకుంటున్నట్టు ప్రకటించాడు. జీవితంలో ఏదైనా కొనగలం కానీ సమయాన్ని కొనలేమనీ, ప్రస్తుతం తన కుటుంబంలో ఎక్కువ సమయం గడిపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాని డికాక్ పేర్కొన్నాడు. అయితే, ప్రస్తుతం జరుగుతున్న దక్షిణాఫ్రికా-ఇండియా సిరీస్‌లో ఫస్ట్ టెస్ట్ ముగిసిన తర్వాత ఈ డికాక్ ఈ నిర్ణయం ప్రకటించడం గమనార్హం.
De Kock: దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు వికెట్ కీపర్, బ్యాటర్ క్వింటన్ డికాక్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్ట్ క్రికెట్ నుంచి తప్పకుంటున్నట్టు ప్రకటించాడు. జీవితంలో ఏదైనా కొనగలం కానీ సమయాన్ని కొనలేమనీ, ప్రస్తుతం తన కుటుంబంలో ఎక్కువ సమయం గడిపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాని డికాక్ పేర్కొన్నాడు. అయితే, ప్రస్తుతం జరుగుతున్న దక్షిణాఫ్రికా-ఇండియా సిరీస్‌లో ఫస్ట్ టెస్ట్ ముగిసిన తర్వాత ఈ డికాక్ ఈ నిర్ణయం ప్రకటించడం గమనార్హం. క్రికెట్ సౌతాఫ్రికా (CSA) పేర్కొన్న వివరాల ప్రకారం.. డికాక్ తన కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాడు. తన భార్య సాషా త్వరలోనే బిడ్డను కనబోతున్నదనీ.. ఈ సమయంలో కుటుంబంతో ఉండటం అత్యంత ప్రధాన్యమైన విషయమని డీకాక్ తెలిపాడు. రాబోయే సంతోషకరమైన రోజుల కోసం ఎదురుచూస్తున్నాని పేర్కొన్నాడు.
Also Read: Apple: టెక్ దిగ్గజం ఆపిల్ తమిళనాడు ప్లాంట్.. షాకింగ్ విషయాలు వెలుగులోకి..
undefined
"ఇది నేను అంత తేలికగా తీసుకున్న నిర్ణయం కాదు. సాషా, నేను మా మొదటి బిడ్డను స్వాగతించబోతున్నందున నా భవిష్యత్తు ఎలా ఉంటుందో.. నా జీవితంలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అనే దాని గురించి ఆలోచించడానికి నేను చాలా సమయం తీసుకున్నాను. ఈ ప్రపంచంలోకి ప్రవేశించబోయే తన బిడ్డ, కుటుంబ ఎదుగుదల కోసం ఈ నిర్ణయం తీసుకున్నాను" అని డికాక్ తెలిపారు. "నా కుటుంబమే నాకు సర్వస్వం. మా జీవితంలోని ఈ కొత్త, ఉత్తేజకరమైన అధ్యాయంలో వారితో ఉండటానికి సమయాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. నేను టెస్ట్ క్రికెట్‌ను ప్రేమిస్తున్నాను. నా దేశానికి ప్రాతినిధ్యం వహించడం చాలా ఇష్టం. నా జీవితంలో ఎన్నొ ఒడిదుడుకులు, ఎత్తుపల్లాలను చూశాను" అని వెల్లడించాడు.
Also Read: journalists: 2021లో 45 మంది జర్నలిస్టుల హత్య.. ప్రమాదంలో పత్రికా స్వేచ్ఛ..
కాగా, 29 సంవత్సరాల డి కాక్.. 2014లో Gqeberha లో స్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ తో టెస్ట్ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు మొత్తం 54 మ్యాచ్ లు ఆడాడు. అత్యధిక స్కోర్ 141 నాటౌట్. 38.82 అవరేజ్.. 70.93 స్ట్రైక్ రేటుతో మొత్తం 3300లకు పైగా పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు ఉన్నాయి. అలాగే, 22 అర్థసెంచరీలు కూడా చేశాడు. వికెట్ కీపర్ గా మంచి గుర్తింపు ఉన్న డీకాక్.. మొత్తం 232 ఔట్స్ చేశాడు ఇందులో 221 క్యాచ్‌లు ఉండగా, మరో 11 స్టంపింగ్ లు ఉన్నాయి. ICC ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో డి కాక్ అత్యధిక క్యాచ్‌ల రికార్డును కూడా నమోదుచేశాడు. టెస్ట్ ఛాంపియన్ షిప్ లో 11 మ్యాచ్‌లలో 48 (47 క్యాచ్‌లు, 1 స్టంపింగ్) ఔట్స్ చేశాడు. 2019లో సెంచూరియన్‌లో ఇంగ్లండ్‌పై ఒక ఇన్నింగ్స్‌లో ఆరు అవుట్‌లను చేయడం డీకాక్ కెరియర్ లో అత్యుత్తమ క్యాచ్ గణాంకాలు నమోదుచేశాడు.
Also Read: Amit Shah: కరోనా మళ్లీ విజృంభిస్తోంది.. నిర్లక్ష్యం వహిస్తే.. మహమ్మారి నియంత్రణ కష్టమే..!
ప్రస్తుతం భారత్ తో టెస్ట్ సిరీస్ కొనసాగుతుండగానే డికాక్ టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడం అందర్నీ అశ్చర్యానికి గురిచేసింది. టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్న తాను.. ఇతర ఫార్మట్ లలో కొనసాగుతానని స్పష్టం చేశాడు. భవిష్యత్తులో తన సామర్థ్యం మేరకు దేశానికి ప్రతినిధ్యం వహిస్తానని పేర్కొన్న డికాక్.. ప్రస్తుతం భారత్ తో జరుగుతున్న సిరీస్ నేపథ్యంలో తన జట్టు సభ్యులకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. అలాగే, తన టెస్ట్ క్రికెట్ ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెబుతున్నానని పేర్కొన్నాడు. తనకు సపోర్టు చేసిన కోచ్‌లు, సహచరులు, వివిధ మేనేజ్‌మెంట్ జట్లు, కుటుంబ సభ్యులు, స్నేహితులకు, తన అభిమానులకు ఈ సందర్భంగా డికాక్ కృతజ్ఞతలు చెప్పాడు.
Also Read: Omicron: ఆ మూడు గంటలు మద్యం అమ్మకాలు ఆపండి... హైకోర్టు ఆదేశాలు