నా సెంచరీ ఆయనకే అంకితం :పృథ్విషా

By Arun Kumar PFirst Published Oct 4, 2018, 8:46 PM IST
Highlights

భారత్-వెస్టిండిస్ ల మధ్య రాజ్‌కోట్‌లో మొదలైన టెస్ట్ మ్యాచ్ లో ఆరంగేట్ర ఆటగాడు పృథ్విషా సెంచరీతో చేలరేగిన విషయం తెలిసిందే. దీంతో తొలి అంతర్జాతీయ మ్యాచ్ లోనే సెంచరీ సాధించిన క్రికెటర్ గా షా రికార్డు నెలకొల్పాడు. అయితే ఈ సెంచరీని తన జీవితంలో అత్యంత ప్రాధాన్యత కలిగిస వ్యక్తికి అంకితం ఇస్తున్నట్లు పృథ్విషా ప్రకటించాడు.

మ్యాచ్ ముగిసిన తర్వాత షా మీడియాతో మాట్లాడుతూ... తన తండ్రికి ఈ సెంచరీని అంకితమిస్తున్నట్లు వెల్లడించాడు. తన కేరీర్ కోసం తండ్రి (పంకజ్) ఎన్నో  వదులుకున్నాడని...అందువల్ల ఈ ప్రత్యేకమైన సెంచరీని అతడికి అంకితం ఇస్తున్నట్లు షా తెలిపాడు. 

ఇంకా తాను ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డానని పృథ్విషా తెలిపాడు. స్కూల్ గేమ్స్ తో పాటు అండర్ 19, రంజీల్లోను తన అత్యుత్తమ ఆటతీరును కనబర్చానని అందువల్లే టీంఇండియా తరపున ఆడే అవకాశం వచ్చిందన్నారు. 

సెంచరీ చేయడానకి గత అనుభవం ఎంతగానో ఉపయోగపడిందని అన్నారు. ఆట ఆరంభంలో కాస్త ఇబ్బందిపడ్డా క్రీజులో కుదురుకున్నాక తన సహజ శైలిలో ఆడానన్నాడు. మంచి బంతులను గౌరవిస్తూనే చెత్త బంతులకు పరుగులు రాబట్టానని తెలియజేశాడు. ఒత్తిడి లేకుండా ఆడటంవల్లే సెంచరీ సాధించినట్లు షా తెలిపాడు.

పృథ్విషా సెంచరీతో చెలరేగడంతో మొదటి రోజు భారత జట్టుదే పైచేయిగా నిలిచింది. ఆట ముగిసే సమయానికి భారత్ 89 ఓవర్ల 4 వికెట్లు కోల్పోయి 364 పరుగులు చేసింది.  ఇందులో షా ఒక్కడివే 134 పరుగులు ఉన్నాయి. తర్వాత పుజారా 86 పరుగులు, రహానే 41 పరుగులు చేశారు. ప్రస్తుతం కోహ్లీ 72 పరుగులు, రిషబ్ పంత్ 17 పరుగులు చేసి క్రీజులో వున్నారు. 

సంబంధిత వార్తలు

సచిన్ కి దక్కని రికార్డ్ ని సొంతం చేసుకున్న పృథ్వీ షా

59 ఏళ్ల రికార్డు బద్ధలు.. అరంగేట్రంలోనే పృథ్వీషా ఘనత

రాజ్‌కోట్ టెస్ట్: మొదటిరోజు టీంఇండియాదే పైచేయి...భారత్ స్కోరు364/4

క్రికెటర్ ఇంట్లో విషాదం...గురువారం ప్రారంభమయ్యే తొలి టెస్ట్‌కు దూరం

click me!