Paris Olympics: ఒలింపిక్ 'గోల్డ్ మెడ‌ల్స్' బంగారంతో చేసిన‌వి కావా?

By Mahesh RajamoniFirst Published Jul 21, 2024, 11:47 PM IST
Highlights

Paris Olympics 2024 : ఫ్రాన్స్ మెగా స్పోర్ట్స్ ఈవెంట్ ఒలింపిక్స్‌కు సన్నద్ధమవుతోంది. దీని నిర్వాహక కమిటీ అధిపతి టోనీ ఎస్టాంగ్యూట్ పారిస్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాబోయే పారిస్ ఒలింపిక్ గేమ్స్ 2024 కోసం అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. 
 

Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్ 2024 పోటీలు 16 రోజుల పాటు జ‌ర‌గ‌నున్నాయి. మొత్తం 329 పతకాల కోసం పోటీలు జ‌ర‌గ‌నున్నాయి. జులై 26 నుంచి అధికారికంగా ప్రారంభం కానున్నాయి. అయితే, విజేత‌ల‌కు అందించే మెడ‌ల్స్ చాలా ప్ర‌త్యేకంగా ఉండ‌బోతున్నాయి. అమెరిక‌న్  స్విమ్మర్ మైఖేల్ ఫెల్ప్స్ తన కెరీర్‌లో మొత్తం 28 ఒలింపిక్ పతకాలు సాధించాడు. వ్యక్తిగత ఈవెంట్లలో అత్యధిక బంగారు పతకాలు (13) అందుకున్న ఒకే ఒక్క అథ్లెట్. వ్యక్తిగత ఈవెంట్లలో అత్యధిక ఒలింపిక్ పతకాలు (16) సాధించిన రికార్డులను కూడా కలిగి ఉన్నాడు. ఒలింపిక్ గేమ్స్ చరిత్రలో విజేత‌కు అందించే గోల్డ్ మెడ‌ల్స్ విష‌యంలో చాలా మార్పులు వ‌చ్చాయి. ఒలింపిక్స్‌లో అందించే గోల్డ్ మెడ‌ల్స్ పూర్తిగా బంగారంతో తయారు చేసినవి కావు. నమ్మషక్యంగా లేకపోయినా ఇదే నిజం..!  అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ప్రకారం, స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో జరిగిన 1912 స‌మ్మ‌ర్ ఒలింపిక్స్‌లో చివరిసారి పూర్తిగా స్వ‌చ్చ‌మైన బంగారు పతకాలను అందించారు.

గ్రీస్‌లోలో ప్రారంభ‌మైన రోజుల ఒలింపిక్ క్రీడలు విజేతలకు ఆలివ్ ఆకుల దండలను ప్రదానం చేశారు. ఈ సంప్రదాయం 1896లో ఆధునిక ఒలింపిక్ క్రీడలతో మార్పులు జ‌రిగాయి. ఇక్కడ విజేతలు ఆలివ్ పుష్పగుచ్ఛము, వెండి పతకాన్ని అందుకున్నారు. అలాగే, ఒలింపిక్ పతకాలను నోటితో కొరికే సంప్రదాయం పురాతన కాలం నుండి వ‌చ్చింది. ఇక్కడ ప్రజలు దాని స్వచ్ఛతను తెలుసుకోవడానికి బంగారం కొరుకుతారు. బంగారం ఒక మృదువైన లోహం కాబ‌ట్టి దానిని కొరికేస్తే అది నిజమైనదైతే ఇండెంటేషన్‌గా అచ్చు ప‌డుతుంది. అందుకే ఇలా ఒలింపిక్ మెడ‌ల్ ను కొరికే ధోర‌ణి వ‌చ్చింది. 

Latest Videos

సొంత విమానాలున్న భార‌త క్రికెట‌ర్లు ఎవ‌రో తెలుసా?

1912 నుండి 1948 వరకు ఒలింపిక్స్ ఆర్కిటెక్చర్, సాహిత్యం, సంగీతం, పెయింటింగ్, శిల్పం వంటి వివిధ విభాగాలలో కళల పోటీలను కూడా నిర్వ‌హించింది. ఈ పోటీలు ఒలింపిక్ కార్యక్రమంలో భాగంగా ఉన్నాయి. అలాగే, విజేత‌ల‌కు మెడ‌ల్స్ కూడా అందించారు. అలాగే, ఒలింపిక్ నినాదం "సిటియస్, ఆల్టియస్, ఫోర్టియస్.. లాటిన్‌లోని ఈ ప‌దాల అర్థం "వేగవంతమైన, ఉన్నతమైన, బలమైన".  1924లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ స్థాపకుడు పియరీ డి కౌబెర్టిన్ దీనిని ప్ర‌వేశ‌పెట్టారు.

 
ఒలింపిక్స్ చరిత్ర‌లో అత్య‌ధిక మెడల్స్ గెలిచిన టాప్-5 అథ్లెట్లు

click me!