దేశమే ముందు: ధోనీ దేశభక్తికి సలాం

Siva Kodati |  
Published : Feb 11, 2019, 10:22 AM IST
దేశమే ముందు: ధోనీ దేశభక్తికి సలాం

సారాంశం

టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీ తన దేశభక్తిని చాటుకున్నాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో హామిల్టన్‌లో జరిగిన చివరి మ్యాచ్‌లో కివీస్ ఇన్నింగ్స్‌‌లో ధోనీ కీపింగ్‌ చేస్తున్నాడు. 

టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీ తన దేశభక్తిని చాటుకున్నాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో హామిల్టన్‌లో జరిగిన చివరి మ్యాచ్‌లో కివీస్ ఇన్నింగ్స్‌‌లో ధోనీ కీపింగ్‌ చేస్తున్నాడు. ఆ సమయంలో ఒక అభిమాని భద్రతను చేధించుకుని గ్రౌండ్‌లోకి దూసుకొచ్చాడు..

వచ్చి రావడంతోనే ధోనీ కాళ్లకు పాదాభివందనం చేశాడు. ఈ క్రమంలో అతని చేతిలో ఉన్న మన జాతీయ జెండా నేలను తాకింది. అంతే.. దీనిని వెంటనే గుర్తించిన మహేంద్రుడు రెప్పపాటులో త్రివర్ణ పతాకాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు.

ఆ తర్వాతే సదరు అభిమానిని పక్కకు జరిపాడు. జాతీయ పతాకాన్ని నేతకు తగలకుండా దాని గౌరవాన్ని కాపాడిన ధోనీని అందరూ ప్రశంసించారు. ఈ దృశ్యాన్ని కెమెరాలు క్లిక్‌మనిపించడంతో ఆ క్షణం ‘‘మూమెంట్ ఆఫ్ ది డే’’ గా నిలిచింది. 

PREV
click me!

Recommended Stories

RCB పక్కా టార్గెట్ వీరే.! ప్రతీ సెట్‌లోనూ ఈ ప్లేయర్స్‌పై కన్ను.. ఎవరెవరంటే.?
IND vs SA: ధర్మశాలలో అదరగొట్టిన భారత బౌలర్లు.. అభిషేక్ శర్మ ఊచకోత