పరుగు కోసం పాండ్యా...వెనక్కెళ్లమన్న దినేశ్ కార్తీక్: నెటిజన్ల ఫైర్

By Siva KodatiFirst Published Feb 11, 2019, 8:31 AM IST
Highlights

మూడు టీ20ల సిరీస్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో భారత్ 4 పరుగుల తేడాతో ఓడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. చివరి వరకు వచ్చి ఓడిపోవడానికి దినేశ్ కార్తీకే కారణమంటూ ఫైరవుతున్నారు. 

మూడు టీ20ల సిరీస్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో భారత్ 4 పరుగుల తేడాతో ఓడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. చివరి వరకు వచ్చి ఓడిపోవడానికి దినేశ్ కార్తీకే కారణమంటూ ఫైరవుతున్నారు.

20వ ఓవర్‌లో జట్టు విజయానికి 16 పరుగులు అవసరం. ఈ దశలో ధాటిగా ఆడుతున్న దినేశ్ కార్తీక్ మొదటి బంతికి డబుల్ తీయగా, రెండో బంతికి పరుగులేమి చేయలేదు. మూడో బంతికి సింగిల్ తీసే అవకాశం వచ్చింది... అవతలి ఎండ్‌లో ఉన్న కృనాల్ పాండ్యా పరుగు కోసం దాదాపు సగం దూరం వచ్చినప్పటికీ... వద్దని సంకేతాలిచ్చాడు.

నాలుగు, ఐదు బంతులకు చెరో సింగిల్ తీయడంతో చివరి బంతికి 11 పరుగులు అవసరమయ్యాయి. ఆ టైమ్‌లో సౌథీ వేసిన ఆరో బాల్ వైడ్ అయ్యింది. చివరి బంతికి కార్తీక్ భారీ సిక్స్ కొట్టినా టీమిండియాకు ఓటమి తప్పలేదు.

అయితే సింగిల్ కోసం దినేశ్ కార్తీక్ రాకపోవడాన్ని పలువురు మాజీలు తప్పుబడుతున్నారు. ఆ సమయంలో కామెంటరీ బాక్స్‌లో ఉన్న గౌతం గంభీర్...దినేశ్‌పై ఫైరయ్యాడు. కృనాల్ పాండ్యా టెయిలెండర్ కాదు ధాటిగే ఆడే బ్యాట్స్‌మెన్ అని అసహనం వ్యక్తం చేశాడు.

కాగా, 2012 కామన్‌వెల్త్ సిరీస్‌లో ధోనీ, అశ్విన్ బ్యాటింగ్‌ చేస్తుండగా... ధోనీ సింగిల్‌ను నిరాకరించి రెండు బంతులు ఉండగానే జట్టును గెలిపించాడు. ఈ సంఘటనను పోల్చుతూ..నువ్వేమైనా ధోనీ...కృనాల్‌ను అశ్విన్ అనుకుంటున్నావా అంటూ ట్వీట్టర్‌లో ట్రోల్ చేస్తున్నారు.

అయితే గతేడాది బంగ్లాదేశ్‌తో జరిగిన నిదహాన్ ట్రోఫీ ఫైనల్‌లో ఆఖరి బంతికి 6 పరుగులు కావాల్సిన సమయంలో దినేశ్ సిక్స్ కొట్టి ఇండియాను గెలిపించాడు. దీనిని సైతం వదిలిపెట్టని నెటిజన్లు ప్రతి మ్యాచ్‌లో సిక్స్ కొట్టి గెలిపించలేవు అంటూ సెటైర్లు వేస్తున్నారు. 

click me!