అదృష్టం న్యూజిలాండ్ వైపే.. ఆ బాల్ వైడ్ అయ్యుంటే

By sivanagaprasad KodatiFirst Published Feb 10, 2019, 5:41 PM IST
Highlights

మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా హామిల్టన్‌లో జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్ గెలుపు ముంగిట చతికిలపడటం అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తోంది. ముఖ్యంగా చివరి ఓవర్ వారిని మరింత అసహనానికి గురిచేసింది.

మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా హామిల్టన్‌లో జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్ గెలుపు ముంగిట చతికిలపడటం అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తోంది. ముఖ్యంగా చివరి ఓవర్ వారిని మరింత అసహనానికి గురిచేసింది.

రోహిత్, పాండ్యా, ధోనీ ఔటైన తర్వాత ఓటమి తప్పదు అనుకున్న సమయంలో దినేశ్ కార్తీక్-కృనాల్ పాండ్యా పోరాటిన తీరు ప్రసంశనీయం. అయితే విజయానికి 6 బంతుల్లో 16 పరుగులు కావాల్సిన సమయంలో కేవలం 12 పరుగులు మాత్రమే సాధించి భారత్ ఓటమి పాలైంది.

సౌతీ వేసిన ఈ ఓవర్‌లో ఓ బాల్ ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. మొదటి బంతికి రెండు పరుగులు చేసిన కార్తీక్.. రెండో బంతికి పరుగులేమీ చేయలేదు. బంతి ఆఫ్ స్టంప్‌కు దూరంగా వెళుతుందని భావించిన కార్తీక్ దానిపై దాడి చేయలేదు.

అయితే ఆ బంతిని అంపైర్ వైడ్‌గా ప్రకటించలేదు. దీనిపై క్రీజులో ఉన్న ఫీల్డ్ అంపైర్‌ను అడిగినా కార్తీక్‌కు నిరాశ తప్పలేదు. ఆ తర్వాత బంతిని కార్తీక్ లాంగాన్ వైపు కొట్టినా సింగిల్‌కు మాత్రం రాలేదు. పైగా సగం క్రీజును దాటి వచ్చేసిన కృనాల్‌ను వెనక్కి వెళ్లిపోమని సంకేతాలిచ్చాడు.

ఈ క్రమంలో భారత్ 3 బంతుల్లో 14 పరుగులు చేయాల్సి వుంది. నాలుగో బంతిని కార్తీక్ సింగిల్ తీయగా, ఆ తర్వాతి బంతిని కృనాల్ సింగిలే తీశాడు. చివరి బంతి వైడ్ కావడంతో భారత్ ఖాతాలో పరుగు చేరగా, కివీస్ మరో బంతి వేయాల్సి వచ్చింది. ఆఖరి బంతిని కార్తీక్ సిక్సర్ కొట్టడంతో భారత్ 208 పరుగులు చేసి 4 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 

హామిల్టన్ టీ20: పోరాడి ఓడిన భారత్, సిరీస్ న్యూజిలాండ్ వశం

టీ20ల్లో ధోనీ అరుదైన రికార్డు.. 300 మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా..

క్యాచ్‌లు నేలపాలు.. నెత్తి బాదుకుంటూ పాండ్యా ఫ్రస్ట్రేషన్

 

click me!