మ్యాచ్ టై: భారత్ ను వణికించిన అఫ్గానిస్తాన్

By Arun Kumar PFirst Published Sep 25, 2018, 5:02 PM IST
Highlights

ఆసియా కప్ లో భారత జట్టు మంచి పామ్ లో ఉంది. ఇప్పటికే ఆడిన మూడు మ్యాచుల్లో టీంఇండియా అద్భుత విజయాలు సాధించింది. పాకిస్థాన్ వంటి స్ట్రాంగ్ జట్టును కూడా చిత్తుగా ఓడించి తనకు తిరుగలేదని నిరూపించుకుంది. ఇవాళ సూపర్ 4 లో బాగంగా అప్ఘాన్ జట్టుతో భారత్ చివరి మ్యాచ్ ఆడుతోంది. 

ఆసియా కప్ లో భాగంగా మంగళవారం జరిగిన సూపర్ ఫోర్ మ్యాచులో భారత్ ను పసికూన అఫ్గానిస్తాన్ వణికించింది. చివరకు మ్యాచును టై చేసింది. ఒక బంతి మిగిలి ఉన్న స్థితిలో భారత్ చివరి వికెట్ కోల్పోయింది. అఫ్గానిస్తాన్ తమ ముందు ఉంచిన 253 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 252 పరుగులు చేసి వికెట్లన్నింటినీ కోల్పోయింది. నిర్ణీత 50 ఓవర్లలో అప్ఘానిస్తాన్ 8 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. ఓపెనర్లు రాహుల్, రాయుడు శుభారంభాన్ని అందించినప్పటికీ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన భారత ఆటగాళ్లలో దినేష్ కార్తిక్ తప్ప ఎవరూ వికెట్ల వద్ద నిలదొక్కుకోలేకపోయారు. 

అఫ్గానిస్తాన్ బౌలర్లలో అఫ్తాబ్ ఆలం, రషీద్, నబీ తలా రెండు వికెట్లు తీసుకోగా.జావెద్ అహ్మదీ ఒక వికెట్ పడగొట్టాడు. అఫ్గానిస్తాన్ ఎక్కడా పట్టు విడవకుండా చివరి వరకు పోరాటం చేసి మ్యాచ్ ను టై చేయగలిగింది.242 పరుగుల స్కోరు వద్ద భారత్ 8వ వికెట్ కోల్పోయింది. ఈ స్థితిలో 11 బంతుల్లో 11 పరుగులు చేయాల్సిన స్థితిలో భారత్ పడింది. 245 పరుగుల వద్ద భారత్ 9వ వికెట్ కోల్పోయింది. భారత్ 7 బంతుల్లో 8 పరుగులు చేయాల్సిన స్థితిలో పడింది.

అఫ్గానిస్తాన్ పై భారత్ 39.4 ఓవర్ల వద్ద 205 పరుగులు చేసి ఆరో వికెట్ కోల్పోయింది. దీంతో భారత్ కష్టాల్లో పడింది. దినేష్ కార్తిక్ 66 బంతుల్లో 44 పరుగులు చేసి అవుటయ్యాడు. 44.5 ఓవర్ల వద్ద భారత్ 226 పరుగులు చేసి ఏడో వికెట్ కోల్పోయింది. చాహర్ 12 పరుగులు చేసి క్లీన్ బౌల్డ్ గా వెనుదిరిగాడు. అప్పటికి భారత్ 31 బంతుల్లో 27 పరుగులు చేయాల్సి ఉండింది.

భారత్ 38.5 ఓవర్ల వద్ద 204 పరుగులు చేసి ఐదో వికెట్ కోల్పోయింది. కేదార్ జాదవ్ 26 బంతుల్లో 19 పరుగులు చేసి రన్నవుట్ అయ్యాడు. నాన్ స్ట్రయికర్ ఎండ్ లో ఉన్న కేదార్ జాదవ్ గమ్మత్తుగా అవుటయ్యాడు. దినేష్ కార్తిక్ కొట్టిన బంతి రెహ్మాన్ చేతులకు తాకి వికెట్లను తాకింది. దీంతో క్రీజు వెలుపల ఉన్న జాదవ్ రన్నవుట్ అయ్యాడు.

భారత్ 30.3 ఓవర్ల వద్ద 166 పరుగులు చేసి నాలుగోవికెట్ కోల్పోయింది. మనీష్ పాండే 15 బంతుల్లో 8 పరుగులు చేసి అఫ్తాబ్ బౌలింగులో షాహజాద్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.భారత్ 20.3 ఓవర్ల వద్ద 127 పరుగులు చేసి రెండో వికెట్ కోల్పోయింది. రాహుల్ 66 బంతుల్లో 60 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగులో అవుటయ్యాడు. రాహుల్ స్కోరులో ఓ సిక్స్, ఐదు ఫోర్లు ఉన్నాయి. కెప్టెన్ ధోనీ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. 25.5 ఓవర్ల వద్ద 143 పరుగుల వద్ద ధోనీ రూపంలో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. 17 బంతుల్లో 8 పరుగులు చేసి అహ్మదీ బౌలింగులో ధోనీ వెనుదిరిగాడు.

ధాటిగా ఆడే క్రమంలో నబీ బౌలింగులో అంబటి రాయుడు బౌండరీ వద్ద  క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరుకున్నాడు. అతను 4 ఫోర్లు, 4 సిక్స్ ల సాయంతో 49 బంతుల్లో 57 పరుగులు చేశాడు. అప్పటికి భారత్ 17.1 ఓవర్లలో 110 పరుగులు చేసింది. అఫ్గనిస్తాన్ తమ ముందు ఉంచిన 253 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ వికెట్ నష్టపోకుండా స్కోరును వంద దాటించింది. అఫ్గానిస్తాన్ బౌలర్లను చితకబాదుతూ రాయుడు అర్థ సెంచరీ చేశాడు. 15 ఓవర్లలో భారత్ 99 పరుగులు చేసింది. ఆ తర్వాత రాయుడు అర్థ సెంచరీ చేశాడు. దాంతో భారత్ స్కోర్ వంద పరుగులు దాటింది.

పసికూన అప్ఘాన్ భారత్ పై రెచ్చిపోయింది. సూపర్ 4 లో భాగంగా జరుగుతున్న చివరి మ్యాచ్ లో అప్ఘన్ బ్యాట్ మెన్స్ భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. ఓపెనర్ మహ్మద్ షజాద్ 116 బంతుల్లో 124 పరుగులు సాధించాడు. అలాగే మరో బ్యాట్ మెన్ నబీ కూడా అర్థశతకంతో విజృంభించాడు. దీంతో అప్ఘాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది. అయితే బౌలింగ్ విభాగంలోనూ అప్ఘాన్ జట్టులో రషీద్ ఖాన్ వంటి స్టార్ బౌలర్ ఉన్నాడు. కాబట్టి భారత్ బ్యాట్ మెన్స్ జాగ్రత్తగా బ్యాటింగ్ చేయకుంటే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. 

ఎట్టకేలకేలకు భారత్ పై అర్థశతకం పూర్తి చేసుకున్న మహ్మద్ నబీ కూడా ఔటయ్యాడు. 64 పరుగుల(54 బంతుల్లో) వ్యక్తిగత స్కోరు వద్ద ఇతడు క్యాచ్ రూపంలో వికెట్ కోల్పోయాడు. ప్రస్తుతం అప్ఘాన్ 48.3 ఓవర్లలో 246 పరుగులు చేసి 8 వికెట్లు కోల్పోయింది. క్రీజులో రషీద్ ఖాన్, అప్తాబ్ ఆలం ఉన్నారు. 

భారత్ బౌలర్లపై విరుచుకుపడి శతకం సాధించిన అఫ్ఘాన్ బ్యాట్ మెన్ షజాద్ ఔటైనా అప్ఘాన్ పరుగుల వేగం తగ్గట్లేదు. షజాద్ ఆడుతున్నంతసేపు కేవలం అతడికి సహకరించడానికి మాత్రమే ప్రయత్నించిన మహ్మద్ నబీ అతడు ఔటవగానే రెచ్చిపోయాడు. తన బ్యాట్ ను ఝలిపిస్తూ 46 బంతుల్లో అర్థశతకం పూర్తి చేశాడు. అయితే ఆ తర్వాతే అప్ఘాన్ మరో వికెట్ కోల్పోయింది. దీంతో అప్ఘాన్ 46 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసింది. 

భారత బౌలర్లపై విరుచుకుపడి సెంచరీ సాధించిన మహ్మద్ షజాద్ ఎట్టకేలకు ఔటయ్యాడు. దీంతో 180 పరుగుల వద్ద అప్ఘాన్ ఆరో వికెట్ కోల్పోయింది. భారత బౌలర్ కుల్దీప్ యాదవ్ షజాద్ వికెట్ పడగొట్టాడు. ఓపెనర్ గా బరిలోకి దిగిన షజాద్ వికెట్లు పడుతున్నా స్కోరు వేగాన్ని తగ్గించకుండా 116 బంతుల్లో 124 పరుగులు చేశాడు. 

ఓవైపు వికెట్లు పడుతున్నా అప్ఘాన్ పరుగుల జోరు ఆగడం లేదు. ఓపెనర్ షహజాద్ భారత్ పై శతకం సాధించాడు. వెంటవెంటనే వికెట్లు పడుతున్నా అతడు ఏమాత్రం జోరు తగ్గించలేదు. ప్రస్తుతం షహజాద్ 99 బంతుల్లో 113 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇతడికి తోడుగా క్రీజులో మహమ్మద్ నబీ బ్యాటింగ్ చేస్తున్నాడు. ప్రస్తుతం అప్ఘాన్  31 ఓవర్లలో 5 వికెట్ల కోల్పోయి 144 పరుగులు చేసింది.   

ఆసియా కప్ సూపర్ 4 లో  టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్ఘాన్ జట్టు మొదట ఎంత వేగంగా ఆడిందో అంత తొందరగా వికెట్లు కూడా కోల్పోతోంది. అప్ఘాన్ బ్యాట్ మెన్స్ ఒకరి వెంట ఒకరు పెవిలియన్ బాట పట్టారు. భారత బౌలర్లు జడేజా 2, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టారు. వీటిలో రెండు స్టంపింగ్ లు ఉన్నాయి. అయితే మొదటినుండి వేగంగా ఆడుతూ ప్రమాదకరంగా కనిపిస్తున్న షహజాద్ మాత్రం ఇంకా అవుటకపోవడం టీంఇండియాకు కాస్త ఆందోళన కల్గిస్తోంది. ప్రస్తుతం అప్ఘాన్ 18.5 ఓవర్లలో సెంచరీ చేసి 4 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ షహజాద్ ఒక్కడే 69 బంతుల్లో 86 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు.

ఎట్టకేలకు అఫ్ఘాన్ వికెట్ పడింది. అప్ఘాన్ ఓపెనర్ అహ్మదీ స్పిన్నర్ జడేజా బౌలింగ్ లో అవుటయ్యాడు. జడేజా వేసిన బంతిని ముందుకొచ్చిక ఆడే క్రమంలో స్టంపవుటయ్యాడు. అయితే అతడు ఔటైనా భారత్ కు ఇంకా ప్రమాదం పొంచి ఉంది. ప్రమాదకరంగా ఆడుతున్న మహ్మద్ షహజాద్ ఇంకా క్రీజులోనే ఉన్నాడు. ప్రస్తుతం షహజాద్, రహ్మత్ షా బ్యాటింగ్ చేస్తున్నారు. 14.4 ఓవర్లలో అప్ఘాన్ 1 వికెట్ కోల్పోయి 81 పరుగులు చేసింది. 

ఆసియా కప్ లో పాకిస్థాన్ వంటి స్ట్రాంగ్ జట్టును అతిసునాయాసంగా ఓడించిన భారత జట్టును పసికూన అఫ్ఘాన్ దీటుగా ఎదుర్కుంటోంది. టాస్ గెలిచి బ్యాంటింగ్ కు దిగిన అఫ్ఘాన్ ఓపెనర్లలో మహ్మద్ షహజాద్ భారత బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. ఇతడు కేవలం 42 బంతుల్లో 56 పరుగులు చేశాడు. ఇతడికి మరో ఓపెనర్ జావేద్ అహ్మది చక్కటి సహకారం అందిస్తున్నాడు. దీంతో 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా అఫ్ఘాన్ జట్టు 63 పరుగులు చేసింది.  

ఆసియా కప్... భారత అభిమానులకు సరికొత్త జోష్ ను అందిస్తోంది. ఈ టోర్నీలో భారత్ జట్టు తిరుగులేని ప్రదర్శన చేస్తూ దూసుకుపోతోంది. ఇప్పటికే లీగ్ దశలో ఓసారి, సూపర్ పోర్ లో మరోసారి దాయాది పాక్ ను భారత జట్టు చిత్తుగా ఓడించింది. ఇలా భారత అభిమానులకు ఫుల్ ఎంటర్‌టెయన్ మెంట్ అందిస్తోంది. అయితే ఇవాళ పసికూన అప్ఘానిస్తాన్ తో భారత జట్టు పోరాడనుంది. అయితే ఈ మ్యాచ్ అంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని భావించిన అభిమానులు కూడా టీవీలకు అతుక్కుపోడానికి సిద్దమయ్యారు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఇవాళ్టి మ్యాచ్ లో టీంఇండియా పగ్గాలు ధోనీ అందుకున్నాడు. 

విరాట్ కోహ్లీకి ఈ టోర్నీ నుండి విశ్రాంతి ఇవ్వడంతో ఇప్పటివరకు రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరించాడు. అయితే అతడికి కూడా ఇవాళ్టి మ్యాచ్ కు విశ్రాంతి ఇవ్వడంతో మరోసారి ధోని టీంఇండియా కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.

కొద్దిసేపటి క్రితమే టాస్ గెలిచిన అఫ్ఘాన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో భారత జట్టు మొదట ఫీల్డింగ్ చేయనుంది. 

ఈ మ్యాచ్‌లో ఏకంగా ఐదు మార్పులతో భారత జట్టు బరిలోకి దిగుతోంది. కెప్టెన్ రోహిత్, ధావన్, భువనేశ్వర్, బుమ్రా, చాహల్‌కు రెస్ట్ ఇచ్చారు. వీరి స్థానంలో కేఎల్ రాహుల్‌, మ‌నీష్ పాండే, దీప‌క్ చ‌హ‌ర్‌, ఖ‌లీల్ అహ్మ‌ద్‌, సిద్ధార్థ్ కౌల్ టీమ్‌లోకి వ‌చ్చారు.

Guess who's turned up at the toss for .

Afghanistan wins the toss and elects to bat first pic.twitter.com/mwyKFN7VmS

— BCCI (@BCCI)

 

click me!