''అంత్యంత సోమరి, బుర్రలేని, ప్రతిభ లేని కెప్టెన్ అతడు''

By Arun Kumar PFirst Published Sep 25, 2018, 4:45 PM IST
Highlights

ఆసియాకప్ లో చిరకాల ప్రత్యర్థుల మధ్య జరిగిన పోరులో భారత్ అద్భుత విజయాలు సాధించింది. ఒకసారి కాదు జరిగిన రెండు మ్యాచుల్లోని పాకిస్థాన్ ను ఓడించి భారత జట్టు తిరుగులేని ఆదిపత్యాన్ని కొనసాగించింది. లీగ్ దశలో కాస్త పోరాటపటిమ కనబర్చిన పాక్ ఆటగాళ్లు సూపర్ 4 మ్యాచ్ లో మాత్రం చేతులెత్తేశారు. ఇలా తమ జట్టు చిత్తుగా ఓడిపోవడాన్ని పాక్ అభిమానులు సహించలేకపోతున్నారు. అదీ భారత్ చేతుల్లో ఘోర పరాభవాన్ని పొందడంతో అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో జట్టు సభ్యులపై ముఖ్యంగా కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ పై పాక్ అభిమానులు సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. అతడి వల్లే పాక్ జట్టు సూఫర్ 4 లో ఓటమిపాలయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సూపర్ 4 లో భాగంగా జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాంటింగ్ ఎంచుకోడాన్ని అభిమానులు తప్పుబడుతున్నారు. అంతకు ముందు జరిగిన లీగ్ మ్యాచ్ లో చేసిన తప్పులే మళ్లీ పునరావృతం చేశారని మండిపడ్డారు. లీగ్ మ్యాచ్ కంటే చెత్త ప్రదర్శనతో దాయాది జట్టు ముందు దేశ పరువు తీశారంటూ దుమ్మెత్తిపోశారు.

కొందరు అభిమానులైతే కాస్త ఘాటుగా స్పందించారు. అసలు జట్టులో ఆడటానికి కూడా పనికిరాని వ్యక్తిని కెప్టెన్ గా చేస్తే ఫలితాలు ఇలానే ఉంటాయని  ఓ అభిమాని  విరుచుకుపడ్డాడు.  '' సర్పరాజ్ కు ప్రతిభ లేదు, ఫామ్ లేదు...అసలు అతడికి బుర్రే లేదు" అంటూ మరో అభిమాని విమర్శించాడు. '' అత్యంత సోమరి కెప్టెన్లలో సర్పరాజ్ ఒకడు...అతడి కెప్టెన్సీని ఇక మీదట మేం అంగీకరించం" అంటూ మరో అభిమాని అసహనం వ్యక్తం చేశాడు.   
 
click me!