ఒలింపిక్స్ వేళ కలవరపెడుతున్న భారత షట్లర్లు...ఈ సారైనా మెరిసేనా?

By telugu teamFirst Published Jan 15, 2020, 8:10 AM IST
Highlights

2020 లో టోక్యో ఒలింపిక్స్‌ ఏడాదిలోకి అడుగుపెట్టిన తరుణంలో భారత బ్యాడ్మింటన్‌ స్టార్స్‌ ఫామ్‌ అందుకోలేకపోవటం పై సర్వత్రా ఆందోళన మొదలయింది. 2020 లో ఆడిన తొలి టోర్నీ, మలేషియా మాస్టర్స్‌లో భారత షట్లర్లు మూకుమ్మడిగా నిరాశపరిచారు. 

2020లో లో అత్యంత కీలకమైన టోక్యో ఒలింపిక్స్ ఉన్నాయి. ఒక పక్క ఇతర దేశాల అథ్లెట్లేమో ఫామ్  ఇప్పటికే, మాస్టర్స్ టోర్నీల్లో తిరుగులేని విజయాలు నమోదు  మన భారత షట్లర్లేమో కనీసం నిలకడ కూడా సాధించలేకపోతున్నారు.

2019 తొలి అర్ధభాగంలో పి.వి సింధు అపూర్వ విజయాన్ని అందించింది. ఏడాది ఆరంభంలోనే సైనా నెహ్వాల్‌ ఓ సూపర్‌ సిరీస్‌ టైటిల్‌ సాధించింది. ఏడాది ద్వితీయార్థంలో డబుల్స్‌ జోడీ సాత్విక్‌సాయిరాజ్‌, చిరాగ్‌ శెట్టిలు థాయిలాండ్ లో విజయం సాధించింది. 

ఇవి మినహా భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారుల గురించి 2019లో చెప్పుకోదగ్గ ఆటతీరు లేదు. విజయాలను అటుంచితే... కనీసం నిలకడగా రాణించటంలో కూడా దారుణంగా విఫలమయ్యారు. 

Also read: సింధు పరాజయాల పరంపర: కారణాలు ఇవే...

2020 లో టోక్యో ఒలింపిక్స్‌ ఏడాదిలోకి అడుగుపెట్టిన తరుణంలో భారత బ్యాడ్మింటన్‌ స్టార్స్‌ ఫామ్‌ అందుకోలేకపోవటం పై సర్వత్రా ఆందోళన మొదలయింది. 2020 లో ఆడిన తొలి టోర్నీ, మలేషియా మాస్టర్స్‌లో భారత షట్లర్లు మూకుమ్మడిగా నిరాశపరిచారు. 

ఇదే వారంలో మన షట్లర్లు మరో పరీక్షకు సిద్ధమయ్యారు. అగ్రశ్రేణి షట్లర్లు సైనా నెహ్వాల్‌, పి.వి సింధు, కిదాంబి శ్రీకాంత్‌లు ఇండోనేషియా మాస్టర్స్‌లో నేడు తొలి మ్యాచ్‌ ఆడనున్నారు. 

వరల్డ్‌ చాంపియన్‌ పి.వి సింధు తొలి రౌండ్లో జపాన్‌ అమ్మాయిని ఎదుర్కొనుంది. అయా ఒహౌరిపై సింధుకు తిరుగులేని రికార్డుంది. జపాన్‌ షట్లర్‌పై సింధు వరుసగా 9 మ్యాచుల్లో విజయం సాధించింది.

అయా కెరీర్‌లో సింధుపై ఇంకా గెలుపు రుచి చూడనలేదు. ఇటీవల అనేక మ్యాచుల్లో అనామక షట్లర్ల చేతిలో కంగుతింటున్న సింధు.. నేడు అయాతో పోరులో మాత్రం జాగ్రత్త అవసరం. 

మరో స్టార్ షట్లర్‌ సైనా నెహ్వాల్‌కు జపాన్‌ అమ్మాయి సయాక టకహసి సవాల్‌ విసురుతోంది. సయాకపై సైనా నెహ్వాల్‌కు మెరుగైన రికార్దే ఉంది. ఈ మ్యాచులో సైనా జోరును కొనసాగించే అవకాశాలు మెండు. 

Also read: ఇండోనేషియా మాస్టర్స్ విజేత సైనా

టోక్యో ఒలింపిక్స్‌లో మెడల్‌తో ఘనంగా బ్యాడ్మింటన్ కి వీడ్కోలు పలకాలనే ఆలోచనలో ఉన్న సైనా నెహ్వాల్‌... పూర్వ వైభవం కోసం కఠోరంగా శ్రమిస్తోంది. ఇదే టోర్నీలో సైనా నెహ్వాల్ భర్త పారుపల్లి కశ్యప్ సైతం పోటీ పడుతుండడం విశేషం. 

పురుషుల సింగిల్స్‌ మాజీ వరల్డ్‌ నం.1 కిదాంబి శ్రీకాంత్‌ ఇండోనేషియా షట్లర్‌ను ఎదుర్కొనున్నాడు. నేడు ఇండోనేషియా మాస్టర్స్‌లో తొలి మ్యాచ్‌ ఆడనున్న భారత జట్టు, టోక్యో ఒలింపిక్స్ వేళ ఫామ్ అందుకొని ఎలాగైనా సూపర్ విజయాలను నమోదు చేయాలనీ భారత అభిమానులు కోరుకుంటున్నారు. 

click me!