హైదరాబాద్ టెస్ట్: పరువు కాపాడిన చేస్...మొదటిరోజు విండీస్ స్కోరు 295/7

By ramya neerukondaFirst Published Oct 12, 2018, 9:56 AM IST
Highlights

ఈ మ్యాచ్ లో ఆడేజట్టు సభ్యులను జాబితాను గురువారం బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

రాజ్ కోట్ టెస్టులో మాదిరిగానే హైదరాబాద్ లోనూ విండీస్ బ్యాటింగ్ చప్పగా సాగుతోంది. అయితే విండీస్ బ్యాట్ మెన్ చేస్ ఒక్కడే మొదటిరోజు ఒంటరిపోరాటం చేసి నాటౌట్ గా నిలిచాడు. దీంతో విండీస్  గౌరవప్రదమైన స్కోరు దిశగా సాగుతోంది. అయితే చేస్ సెంచరీకి చేరువయిన(98 పరుగులు) సమయంలో మొదటి రోజు ఆట ముగిసింది. చేస్, హోల్డర్లు మంచి బాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో విండీస్ మొదటిరోజు ఆట ముగిసే సమయానికి ఏడు వికెట్లు కోల్పోయి 295 పరుగులు చేసింది. చివరి క్షణంలో హోల్డర్ వికెట్ ను భారత బౌలర్ ఉమేష్ యాదవ్ వీరి బాగస్వామ్యానికి తెరదించాడు.

భారత భౌలర్లలో ఉమేష్ యాదవ్ 3, కుల్దీప్ యాదవ్ 3, అశ్విన్ 1 వికెట్ తీసుకున్నారు. 

హైదరాబాద్ టెస్ట్ లోనూ భారత్ బౌలర్ల జోరు కొనసాగుతోంది. అయితే క్రీజులో కుదురుకుని మరో వికెట్ తొందరగా పడకుండా హోల్డర్, చేస్ జంట కాస్సేపు అడ్డుకున్నారు. దీంతో 182 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన విండీస్ 286 పరుగుల వరకు మరో వికెట్ పడకుండా ఆడింది. అయితే ఉమేష్ యాదవ్ హోల్డర్ ని ఔట్ చేయడంతో ఏడో వికెట్ బాగస్వామ్యానికి తెరపడింది. హోల్డర్ 52 పరుగులు చేసి ఔటయ్యాడు.

కానీ చేస్ మాత్రం ఆచితూచి బ్యాటింగ్ చేస్తూ సెంచరీకి దగ్గరయ్యాడు. ప్రస్తుతం అతడు 94 పరుగులతో నాటౌట్ గా నిలిచి బ్యాటింగ్ చేస్తున్నాడు. మొత్తానికి విండీస్ 94 ఓవర్లలో 290 పరుగులు చేసి ఏడు వికెట్లు కోల్పోయింది. 

కుల్దీప్ యాదవ్ దెబ్బకు వెస్టిండీస్ 113 పరుగులకే ఐదో వికెట్ కోల్పోయింది. అంబ్రీస్ 18 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద చేతులెత్తాశాడు. వెస్టిండీస్ 182 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. డౌరిచ్ 30 పరుగులు చేసిన ఉమేష్ యాదవ్ బౌలింగులో అవుటయ్యాడు.

భారత్ పై జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్సులో శుక్రవారం ఉదయం వెస్టిండీస్ 86 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.హోప్ 36 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద యాదవ్ బౌలింగులో అవుటయ్యాడు. వెస్టిండీస్ 92 పరుగుల స్కోర్ వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. హెట్ మియర్ కుల్దీప్ యాదవ్ బౌలింగులో 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరుకున్నాడు.

హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో బారత్ పై జరుగుతున్న రెండో టెస్టు మ్యాచులో వెస్టిండీస్ కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. 52 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 22 పరుగులు వెస్టిండీస్ స్కోరు వద్ద పావెల్ అశ్విన్ బౌలింగులో ఔట్ కాగా, బ్రైత్ వైటె కుల్దీప్ యాదవ్ బౌలింగులో 52 పరుగుల వద్ద పెవిలియన్ చేరుకున్నాడు.

భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. తొలి టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా ఈ టెస్టులోనూ గెలిచి సిరీస్‌ కైవసం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు ఈ టెస్టులోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని విండీస్‌ భావిస్తోంది. ఈ మ్యాచ్ లో ఆడేజట్టు సభ్యులను జాబితాను గురువారం బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ  జట్టు విషయంలో నెటిజన్లు.. బీసీసీఐ పై విమర్శలు కూడా చేశారు. 

raed more news

రెండో టెస్టుకి జట్టు ఖరారు.. విహారికి దక్కని చోటు

click me!