విహారి, మయాంక్ కి దక్కని చోటు.. సెలెక్టర్లపై నెటిజన్ల విమర్శలు

By ramya neerukondaFirst Published Oct 11, 2018, 4:12 PM IST
Highlights

వెస్టిండీస్‌ హోరాహోరీగా పోటీనిస్తున్న జట్టేమీ కాదు. కనీసం ఐదు రోజులు ఆడేలా కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పూర్తిస్థాయి టీమిండియాను బరిలోకి దింపాల్సిన అవసరం ఏముందని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

హైదరాబాద్ వేదికగా భారత్-విండీస్ ల మధ్య జరగనున్న రెండో టెస్టుకి జట్టుని ఎంపిక చేశారు. ఈ జట్టులో విహారి, మయాంక్, మహ్మద్ సిరాజ్ లకు చోటు దక్కలేదు. మయాంక్‌ రెండేళ్లుగా దేశవాళీ క్రికెట్‌లో దుమ్మురేపాడు. పరుగుల వరద పారించాడు. సెలక్టర్లు ఎన్నిసార్లు తనను నిరాశ పరిచినా అద్భుత ప్రదర్శనతో మళ్లీ మళ్లీ తననెందుకు ఎంపిక చేయరని ప్రశ్నించాడు. సిరాజ్‌ సైతం భారత్‌-ఏ తరఫున అద్భుతాలు సృష్టించాడు. ఇక హనుమ విహారి ప్రతిభేంటో అందరికీ తెలిసిందే.

వెస్టిండీస్‌ హోరాహోరీగా పోటీనిస్తున్న జట్టేమీ కాదు. కనీసం ఐదు రోజులు ఆడేలా కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పూర్తిస్థాయి టీమిండియాను బరిలోకి దింపాల్సిన అవసరం ఏముందని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ‘కొత్తవారికి తగినన్ని అవకాశాలు ఇవ్వొచ్చు కదా’ అని అంటున్నారు. 

దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ వంటి పెద్ద జట్లపై పూర్తిస్థాయి జట్టును బరిలోకి దించాలి. అప్పుడు సీనియర్లను పక్కనపెట్టే అవకాశం ఉండదు. నిజానికి మహ్మద్‌ షమి తొలి టెస్టులో కాస్త ఇబ్బంది పడ్డాడు. పూర్తి స్థాయి ఫిట్‌నెస్‌తో ఉన్నట్టు కనిపించడం లేదు. అతడి స్థానంలో సిరాజ్‌ను ఎంపిక చేస్తే బాగుండేదని ట్విటర్‌లో ప్రశ్నల వర్షం కురుస్తోంది. 

ఇక మయాంక్‌ పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు. విండీస్‌పైనే అవకాశం ఇవ్వకపోతే కఠిన జట్టుపై అరంగేట్రం చేయించగలరా వీరు? అని ప్రశ్నిస్తున్నారు. మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా సైతం టీమిండియా ఎంపికపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

read more news

రెండో టెస్టుకి జట్టు ఖరారు.. విహారికి దక్కని చోటు

click me!