భారత్ వర్సెస్ పాకిస్థాన్ ప్రపంచకప్ 2023 : అహ్మదాబాద్ చేరుకున్న అనుష్క శర్మ...

By SumaBala BukkaFirst Published Oct 14, 2023, 11:54 AM IST
Highlights

భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కోసం విరాట్ కోహ్లీ భార్య అనుష్కా శర్మ అహ్మదాబాద్ కు చేరుకుంది. నేడు జరగనున్న మ్యాచ్ పై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. 

న్యూఢిల్లీ : బాలీవుడ్ స్టార్, భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి భార్య, అనుష్క శర్మ శనివారం ఉదయం అహ్మదాబాద్‌ కు చేరుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో పాకిస్థాన్‌, భారత్ ప్రపంచ కప్ మ్యాచ్‌ జరగనుంది. దాయాదుల పోరు ఉత్కంఠగా మారింది. ఈ పోరులో భర్తకు ఉత్సాహాన్ని ఇవ్వడానికి అనుష్క అహ్మదాబాద్‌లో అడుగుపెట్టింది.

1992 నుండి ఇప్పటివరకు భారత్, పాకిస్తాన్ ల మధ్య ఏడు సార్లు పోటీ పడింది. కానీ ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ భారత్‌పై ఎన్నడూ గెలవలేదు. బాబర్ అజామ్ నేతృత్వంలోని జట్టు మరోసారి ఇండియాతో పోటీకి బరిలో దిగుతోంది. స్వదేశీ జట్టుకు మద్దతుగా ఉన్న లక్షలాదిమంది అభిమానులు ఉన్న ఈ పోటీ పాకిస్తాన్ కు ఛాలెంజింగే. 

ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ కు ముందు... బాబర్ సేనకు ప్లైట్ సిబ్బంది స్పెషల్ సర్ప్రైజ్ (వీడియో)

భారత్ మొత్తం ODIలో హెడ్-టు-హెడ్‌లో పాకిస్తాన్‌పై 56 విజయాలు,  73 ఓటములతో వెనుకబడి ఉన్నప్పటికీ, ఇటీవలి సమావేశాలలో ఆతిథ్య జట్టు అయిన భారత్ బలమైన జట్టుగానే ఉంది.

భారత్ క్రికెట్ టీం ప్రపంచ కప్‌లో అగ్రశ్రేణి ODI జట్టుగా ఉంది. ఐదుసార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియాపై ఆరు వికెట్ల విజయంతో ఊపులో ఉంది. ఆఫ్ఘనిస్తాన్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసింది, ఈ గేమ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ ప్రపంచకప్‌లో ఏడో సెంచరీ చేసి రికార్డు సాధించారు. 

పాకిస్తాన్ తమ మొదటి రెండు మ్యాచ్‌లలో సమానంగా ఆధిపత్యం చెలాయించింది. నెదర్లాండ్స్‌ను ఓడించి శుభారంభం చేసింది. ఆ తర్వాత 345 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంకపై అద్భుతమైన విజయం సాధించింది.

 

click me!